Breaking News

ఈ నెలా తగ్గిపోయిన పింఛన్లు

Published on Sun, 02/02/2025 - 05:32

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవ్వాతాతలు, వితంతు­వులు, దివ్యాంగులు తదితరులకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల సంఖ్య ఈ నెల కూడా తగ్గిపోయింది. గత నెల (జనవరి)లో పంపిణీ చేసేందుకు ప్రభు­త్వం విడుదల చేసిన పింఛన్లకంటే శనివారం (ఫిబ్రవరి 1న) విడుదల చేసిన పింఛన్లు 18,036 తగ్గిపోయాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.

ఇలా గత ఎనిమిది నెలల్లో ఏకంగా 1,89,957 పింఛన్లు తగ్గిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు గత ఏడాది మే నెలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 65,49,864 మందికి పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేయగా, శనివారం చంద్రబాబు ప్రభు­త్వం 63,59,907 మంది లబ్దిదారులకే నిధులు విడుదల చేసింది. జనవరి నెల పింఛన్ల పంపిణీకి డిసెంబరు 31న 63,77,943 మందికే నిధులివ్వడం గమనార్హం.

భయం భయంగా లబ్ధిదారులు
చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే కొత్తగా ఎవరూ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకుండా ఆన్‌లైన్‌ సేవలు పూర్తిగా నిలిపివేసింది. మరోపక్క.. గత ఐదేళ్లుగా ఎటువంటి టెన్షన్‌ లేకుండా ప్రతి నెలా ఠంఛన్‌గా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లబ్ధిదారుల సంఖ్యనూ తగ్గించేస్తోంది. ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను ఇప్పుడు అర్హత నిరూపించుకోవాలంటూ సర్వే, స్పెషల్‌ డ్రెవ్‌ల పేరుతో రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త పింఛన్‌దారుల అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన జరుపుతోంది. దీంతో తమ పింఛనుకు ఎప్పుడు ఎలా ఎసరు పెట్టేస్తారోనని లబ్ధిదారులు నిత్యం భయంభయంగా గడుపుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)