Breaking News

AP: గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీలో మరోసారి ‘కారుణ్యం’ 

Published on Thu, 08/17/2023 - 07:26

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధిని చాటుకుంటూ మరోసారి కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సర్వీసులో ఉండగా మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ఊరట కల్పిస్తూ అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించనున్నారు. 2016 నుంచి 2020 జనవరి వరకు మృతి చెందిన 311 మంది ఆర్టీసీ సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అనుమతించారు.

ఆ ఉద్యోగాలను భర్తీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం వారికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా 2020 జనవరి 1 నుంచి ఇప్పటివరకు మరణించిన ఆర్టీసీ సిబ్బంది వారసులకు కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. ఈమేరకు రెండో విడత కారుణ్య నియామకాలకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. 

మూడు దశల్లో..
2020 జనవరి 1 నుంచి 2023 ఆగస్టు 15 వరకు 1,538 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. ఆయా కుటుంబాల్లో అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద మూడు దశల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి దశలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా కమిటీలు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఆయా జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని నియమిస్తారు. జిల్లా కమిటీలు గుర్తించిన పోస్టులను భర్తీ చేయగా మిగిలిన వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తారు. అప్పటికీ ఇంకా అర్హులు మిగిలిపోతే వారికి మళ్లీ జిల్లా కమిటీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారు. ఇప్పటికే మొదటి దశగా జిల్లా కమిటీల ద్వారా కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టారు. మిగిలిన ఉద్యోగాల కల్పనకు కూడా ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. 

ఆర్టీసీలో 715 పోస్టుల గుర్తింపు
కారుణ్య నియామకాల కోసం ఆగస్టు 15 నాటికి ఆర్టీసీలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలను గుర్తించారు. రాష్ట్రంలో 12 ఆర్టీసీ రీజియన్ల వారీగా మొత్తం 715 ఉద్యోగాలను గుర్తించారు. వీటిలో డ్రైవర్‌ పోస్టులు 346, కండక్టర్‌ పోస్టులు 90, అసిస్టెంట్‌ మెకానిక్‌ పోస్టులు 229, ఆర్టీసీ కానిస్టేబుల్‌ పోస్టులు 50 ఉన్నాయి. కారుణ్య నియామకాల కింద ఈ పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు చెప్పారు. అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. 
– సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ

ప్రభుత్వానికి ఎన్‌ఎంయూ కృతజ్ఞతలు
కారుణ్య నియామకాల భర్తీకి ఆర్టీసీలో 715 పోస్టులను గుర్తించడం పట్ల నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈమేరకు సర్క్యులర్‌ జారీ చేయడంపై ముఖ్యమంత్రి జగన్, ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమల­రావుకు ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాస­రావు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: AP: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మరో శుభవార్త

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)