Breaking News

చిన్న పరిశ్రమల వికాసంపై ఫోకస్‌ 

Published on Mon, 03/04/2024 - 06:14

సాక్షి, అమరావతి: అత్యధికులకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లను చేయి పట్టి నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలన్నింటినీ గుర్తించి ‘ఉద్యమ్‌’ పోర్టల్‌లో నమోదు చేయించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో­పా­టు మార్కెటింగ్‌ అవకాశాలు, బ్యాంకుల నుంచి రుణాలందించడం, అవకాశాలను అంది పుచ్చు­కుంటూ విస్తరించే విధంగా అవకాశాలు కల్పించడం, ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ తక్కు­­వ వ్య­యంతో ఉత్పత్తి చేయించడం, ఎస్సీలు, ఎస్టీ­లు, మ­హిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే వి­ధంగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించింది. 

‘ఉద్యమ్‌’ పోర్టల్‌లో నమోదుకు చర్యలు 
ఇప్పటికీ ఉద్యమ్‌ పోర్టల్‌లో నమోదు కాని ఎంఎస్‌ఎంఈలు 45 లక్షలకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని త్వరతగతిన గుర్తించి ఉద్యమ్‌ పోర్టల్‌లో నమోదు చేయించే విధంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఎంఎస్‌ఎంఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉద్యమ్‌ పోర్టల్‌లో నమోదైన ఎంఎస్‌ఎంఈల సంఖ్య 7.52 లక్షలు కాగా.. వీటిలో 1.6 లక్షల పరిశ్రమలు తయారీ రంగానికి చెందినవి కాగా 5.7 లక్షల యూనిట్లు సేవా రంగానికి చెందినవి. వీటిలో 96 శాతం యూనిట్లు అత్యధికంగా సూక్ష్మ రంగానికి చెందినవే కావడం గమనార్హం. 
 
ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోళ్లు తప్పనిసరి 
రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విభాగాలు ఏటా చేసే కొనుగోళ్లలో 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్‌ఎంఈ యూనిట్ల నుంచే ఉండాలంటూ జీవోను జారీ చేసింది. కోవిడ్‌ సమయంలో ఎంఎస్‌ఎంఈలు మూతపడకుండా చేయూతనిచ్చే విధంగా ఈ జీవోను తీసుకొచ్చింది. అయినా.. కొన్ని ప్రభుత్వ విభాగాలు రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తున్నట్టు ప్రభుత్వ దృష్టికి రావడంతో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈలను కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తే అటువంటి బిల్లులకు ఆమోదం తెలపవద్దంటూ ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.  ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ఎంఎస్‌ఎంఈలకు చాలా ప్రోత్సాహం లభిస్తుందని ఎఫ్‌ఎస్‌ఎంఈ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)