Breaking News

బోసి నవ్వులకు భరోసా

Published on Sat, 11/25/2023 - 05:14

రాజవొమ్మంగి మండలం దూసర­పాముకు చెందిన మంగ, అప్పారావు దంపతులకు గత ఏడాది మేలో స్థానిక పీహెచ్‌సీలో పాప పుట్టింది. అయితే, 800 గ్రాములే బరువు ఉంది. అవ­య­వాల ఎదుగుదల లేకపోవ­డంతో అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్‌­లోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ 3 ­నెలల పాటు చికిత్స అందించారు. పాప 1.755 కేజీల బరువు పెరిగి పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఇలా పుట్టుకతో బరువు తక్కువగా ఉండటం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న చిన్నారులకు రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు అండగా నిలుస్తు­న్నాయి. 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో శిశు మరణాల నివారణే లక్ష్యంగా సీఎం జగన్‌ ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో తీసుకున్న చర్యలు ఫలించాయి. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరుకునే వరకూ అడుగడుగునా ప్రభుత్వం చేయిపట్టి నడిపిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వాస్ప త్రుల్లోని పీడియాట్రిక్‌ (చిన్న పిల్లల) వైద్య విభాగాలను బలోపేతం చేస్తోంది. వార్డుల్లో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, పూర్తిస్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించింది. దీంతో.. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్స్‌ (ఎస్‌ఎన్‌సీయూ)లో శిశు మరణాల రేటు ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 2018–19లో ఎస్‌ఎన్‌సీయూ ల్లో ప్రతి వెయ్యి జననాలకు శిశు మరణాల రేటు 12.3గా ఉండేది. 

కేంద్రం అభినందనలు..
ఇక 2019 నుంచి సీఎం జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ మరణాల రేటు క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య 6.6కు తగ్గింది. పూర్తిస్థాయిలో ఈ మరణాలను నియంత్రించడానికి వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా అనతికాలంలో ఎస్‌ఎన్‌సీయూల్లో శిశు మరణాలను గణనీయంగా నియంత్రించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల కేంద్రం సైతం అభినందించింది. 

380 పడకలు పెంపు..
నవజాత శిశు మరణాల నియంత్రణా చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఎస్‌ఎన్‌సీయూ, నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ)లలో పడకలను వైద్యశాఖ పెంపొందిస్తూ వస్తోంది. 2019కు ముందు.. రాష్ట్రంలో 62 ఎస్‌ఎన్‌సీయూల్లో 585 పడకలు అందుబాటులో ఉండేవి. వీటికి అదనంగా వార్డులను ఏర్పాటుచేస్తూ 755కు ప్రభుత్వం పడకలకు పెంపొందించింది. మరోవైపు.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో శిశు సంరక్షణ కేంద్రాల బలోపేతం చేపట్టింది. ఇందులో భాగంగా 11 ప్రభుత్వాస్పత్రుల్లో 20 పడకల చొప్పున, మరో 8 ఆస్పత్రుల్లో 10 పడకల చొప్పున ఎస్‌ఎన్‌సీయూ, నాలుగు ఆస్పత్రుల్లో 20 పడకల చొప్పున ఎన్‌ఐసీయూ ఏర్పాటుచేసింది. వీటిల్లో వైద్యసేవలు అందించడానికి 250 మంది వరకూ వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టారు. సీప్యాప్, ఫొటోథెరపీ యూనిట్, రేడియంట్‌ వార్మర్, ఇతర అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. ఈ యూనిట్స్‌లో త్వరలో వైద్యసేవలు ప్రారంభించనున్నారు.

 

సేవలు వినియోగించుకోవాలి
సరైన వైద్యం అందక ఏ ఒక్క చిన్నారి ప్రాణం పోకూడదనేది సీఎం జగన్‌ సిద్ధాంతం.  ఈ క్రమంలో మాతా, శిశు మరణాల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. నవజాత శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా సంరక్షణ కేంద్రాలన్నింటిలో సదుపాయాలు బలోపేతం చేపట్టాం. 380 ఎస్‌ఎన్‌సీయూ, 80 ఎన్‌ఐసీయూ పడకలను పెంచాం. ఈ యూనిట్స్‌ అన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేట్‌లో ఎంతో ఖరీదైన వైద్యసేవలు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో లభిస్తున్నాయి. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి. 
– జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ 

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్