Breaking News

హజ్‌ యాత్రికులకు ఏపీ ప్రభుత్వ సహకారం    

Published on Wed, 05/10/2023 - 12:44

సాక్షి, న్యూఢిల్లీ/చిత్తూరు కార్పొరేషన్‌ : కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్‌ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లేవారిపై పడే అధిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉప ముఖ్యమంత్రి, మైనారిటీశాఖ మంత్రి అంజాద్‌ బాషా చెప్పారు.  ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. అనంతరం అంజాద్‌ బాషా ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హజ్‌ యాత్రికుల సమస్యపై పౌరవిమానయాన శాఖ మంత్రితో చర్చించామని, బుధవారం కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో సమావేశం అవుతామని తెలిపారు.

హైదరాబాద్, బెంగళూరులలోని ఎంబార్కేషన్‌ పాయింట్ల కన్నా విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి ధరలు అధికంగా ఉన్నాయని, ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఒక్కొక్కరికీ హైదరాబాద్‌ నుంచి రూ.3.05 లక్షలు, బెంగళూరు నుంచి రూ.3.04 లక్షలు ఉండగా.. విజయవాడ నంచి రూ.3,88,350 ఉందని తెలిపారు. ఒకవేళ ధర తగ్గించడం సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే అదనపు భారం భరిస్తుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఎంబార్కేషన్‌ పాయింటును హైదరాబాద్‌ లేదా బెంగళూరుకు మార్చాలని మంత్రిని కోరామన్నారు. మైనారిటీల ఓట్ల కోసం హజ్‌ యాత్రికుల సమస్యను టీడీపీ రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఏపీ హజ్‌ కమిటీ చైర్మన్‌ గౌస్‌లాజమ్, సభ్యులు ఉన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)