Breaking News

యూరియా దొరక్కపోతే చచ్చిపోతా

Published on Fri, 09/12/2025 - 04:18

వజ్రపుకొత్తూరు రూరల్‌: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానా­లతో రైతులు అష్టకష్టాలు పడుతు­న్నారు. పంటలకు అవసరమైన సమయంలో యూరియా కోసం కాళ్లరిగేలా తిరుగుతు­న్నారు. యూరియా కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిన ఓ రైతు సోషల్‌ మీడియాలో తన బాధను పంచుకు­న్నారు. యూరియా దొరక్క­పోతే చచ్చిపో­తా­­నని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామానికి చెందిన ఇచ్ఛాపురం గణపతి అనే రైతు ఆవేదన ఇలా ఉంది. ‘గణపతి అనే నేను ఆటో నడపలేక నాలుగు ఆవులను కొను­క్కున్నా. మూడె­కరాల భూమిని కౌలుకు తీసు­కొని సాగు చేస్తున్నా. ఓ వైపు నీరు సరిపడా లేకపోయినా ఇంజిన్లు పెట్టుకొని బాధలు పడుతున్నాం.

మరో వైపు యూరియా దొరక­డం లేదు. గోల్‌మాల్‌ చేసేస్తు­న్నారు. ఎరువు కావాలంటే 1బి కావా­లంటున్నారు. కౌలు రైతులకు 1బి, పాసు పుస్త­కాలు ఇవ్వడం లేదు. సచివాల­యాల్లో సిబ్బంది ఉండటం లేదు. రైతులకు దొరకని యూరియా బ్లాక్‌ మార్కె­ట్‌లో బస్తా రూ.700 పైచిలుకుతో దొరు­కుతోంది. మొన్నే మా ఫ్రెండ్‌ బ్లాక్‌ మార్కెట్‌లో రూ.750తో కొనుక్కొ­చ్చాడు. ఆర్బీకేల్లో యూరి­యా ఎందుకు దొరకడం లేదు? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. కూటమి పాల­నలో చాలా ఇబ్బంది పడుతున్నాం.

ఆటో వాళ్ల బతుకులు బాగో లేవు. రైతుల బతుకులూ అంతే. చదువుకున్న పిల్లలకు బతుకుదెరువు లేదు. డాక్టర్‌ కోర్సు చదవా­లనుకున్న విద్యా­ర్థులకు బతుకులు లేవు.. ఇలాగైతే ఎలా? ప్రజలను మోసం చేసి ప్రభు­త్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఏమై­నా అడి­గితే అరె­స్టులు.. తన్నండ్రా అని కూటమి నాయ­కులు అంటున్నారు. యూరియా దొరక్క.. ఎరు­వులు దొరక్క రైతు­లు  ఇన్ని ఇబ్బందులు పడుతు­న్నారే.. ఏం చేయాలో చెప్పండి సార్‌.. ఎలా వ్యవసాయం చేయాలి.. బతకాలా, ఎండ్రీను తాగి సావా­లా.. పరి­ష్కారం చెప్పండి సార్‌. యూరియా దొర­క్క­పోతే వారంలో చచ్చిపోవా­లనుకుంటున్నా..’ అని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పురు­గుల మందు డబ్బా చూపిస్తూ ఈ రైతు వ్యక్తం చేసిన ఆవే­దన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)