Breaking News

బాబూ.. దసరాకు మొండిచెయ్యేనా!?

Published on Sun, 09/21/2025 - 07:51

సాక్షి, అమరావతి: దసరాకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మొండిచెయ్యి చూపిందని.. శుక్రవారం జరిగిన కేబినెట్‌లో ఒక డీఏ, ఐఆర్‌ ఇస్తారని ఉద్యోగులందరూ ఎదురుచూసినా ఫలితం దక్కలేదని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కె.వెంకటరామిరెడ్డి  విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం స్పష్టంగా కనపడుతోందని శనివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా ఇంతవరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ, ఐఆర్‌ వంటి వాటిలో కనీ­సం ఒక్కటి కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు.

ఆయన ఇంకా ఏం తెలిపారంటే.. ఎన్నికల్లో టీడీపీ కూటమి ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి ఆశలు కలి్పంచింది. కానీ, అధికారం చేపట్టాక వారిని పూర్తిగా మర్చిపోయింది.  పైగా.. రెగ్యులర్‌గా ఇవ్వా­ల్సిన డీఏలు కూడా ఇవ్వడంలేదు. అలాగే, ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి గురించి అస్సలు మాట్లాడటంలేదు. ప్రతీ పండక్కి ఉద్యోగులు ఎదురుచూడటం.. తర్వాత నిరాశ చెందటం పరిపాటిగా మారింది. నిజానికి.. 2019లో అప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచి్చన 27 శాతం మధ్యంతర భృతిని మొదటి కేబినెట్‌ సమావేశంలోనే ఆమోదించి 2019 జులై 1 నుంచి ఉద్యోగులకు జీతంతో కలిపి ఐఆర్‌ ఇచి్చంది.  

రూ.22 వేల కోట్ల బకాయిల ఊసేలేదు.. 
అలాగే, గత జులైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.22 వేల కోట్లు.  అయితే, ఇటీవల జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు అడిగినా ప్రభుత్వం పెండింగ్‌ బకాయిల వివరాలు వెల్లడించలేదు. ఇప్పుడా బకాయిలు రూ.30 వేల కోట్లకు పైగా చేరుకున్నాయి. పాత బకాయిల్లో పోలీసులకు రెండు సరెండర్‌ లీవ్‌ బిల్లులు సంక్రాంతి రోజు చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పినా ఇప్పటివరకు కేవలం ఒక్క బిల్లు మాత్రమే చెల్లించారు. ఇక ప్రభుత్వం మారగానే పీఆర్‌సీ కమిషనర్‌ రాజీనామా చేశారు. ఇప్పటివరకు కొత్త కమిషనర్‌ను నియమించలేదంటే ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంత చిన్నచూపో అర్ధమవుతోంది. కేవలం 12వ పీఆర్‌సీ అమలును 2029 ఎన్నికల వరకు సాగదీయడానికే ప్రభుత్వం నియమించడంలేదు.  

ఉద్యోగులంతా పోరాటానికి సిద్ధం కావాలి.. 
అన్ని ఉద్యోగ సంఘాలు 15 నెలలుగా వివిధ రూపాలలో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడంలేదు. ఉద్యోగులు రోడ్డు మీదకి రాక తప్పదు. సమస్యలపై పోరాటానికి సిద్ధంకావాలి. దసరాలోపు డీఏ, ఐఆర్, బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపొతే పండగ తర్వాత అందరితో చర్చించి నిరసన కార్యక్రమాలు చేపడతాం. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)