Breaking News

రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్‌

Published on Wed, 05/15/2024 - 13:22

గుంటూరు:  ఏపీ ఈఏపీసెట్(ఎంసెట్‌)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె. హేమచంద్రరెడ్డి తెలిపారు. ‘‘రేపటి(గురువారం) నుంచి ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. రేపు, ఎల్లుండి బైపీసీ గ్రూపుకి ఎప్‌సెట్ పరీక్షలు జరుగుతాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నాం. 

ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్‌. మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండవ సెషన్‌గా పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు. హైదరాబాద్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 3,61,640 మంది ఈ ఎప్‌సెట్‌కు‌ హాజరవుతున్నారు. ఇందులో మహిళలు 1,81,536 మంది, పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంపీసీ విభాగంలో 34,828 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. బైపీసీ విభాగంలో మాత్రం 13,138 మంది విద్యార్ధులు గత ఏడాదితో పోలిస్తే  తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని తెలిపారు.

ముఖ్యమైన సూచనలు..
‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. పరీక్షా కేంద్రంలో పలికి విద్యార్ధులను అరగంట ముందుగా అనుమతి ఇస్తాం. పరీక్షా కేంద్రాలకి బస్సులు నడపాలని ఆర్టిసిని విజ్ణప్తి చేశాం. పరీక్షా కేంద్రాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశాం. 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కులు విధానం లేదు. బయోమెట్రిక్ విధానంతో హాజరు తీసుకుంటాం‌ కాబట్టి చేతులకి మెహందీ పెట్టుకోవద్దు. చెవులకి చెవి దిద్దులు తీసేసి పరీక్షలకి హాజరు కావాలి. ప్రతీ హాల్ టికెట్ వెనుక పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ కూడా ఉంటుంది’’ అని హేమచంద్రారెడ్డి  తెలిపారు.

ఒక నిమిషం‌ నిబంధన పక్కాగా అమలు చేస్తాం..
ఏపీ ఈఏపీసెట్‌ రీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఎప్‌సెట్ చైర్మ‌న్‌, కాకినాడ జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరాజు తెలిపారు. ‘‘ఒక నిమిషం‌ నిబంధన పక్కాగా అమలు చేస్తాం. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకి ముందుగానే చేరుకోవాలి. ఇప్పటికే విద్యార్ధులకి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేయడానికి అందుబాటులో ఉంచాం. విద్యార్థులెవరూ ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దు. విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి’’ అని తెలిపారు.

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)