Breaking News

డీఎస్సీ ఫలితాలు విడుదల

Published on Tue, 08/12/2025 - 03:40

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వం సోమవారం డీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియా­కానికి డీఎస్సీ–2025 నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఖాళీలకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు చేసుకున్నారు. వారికి జూన్‌ 6వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకూ 23 రోజులపాటు పరీక్షలు నిర్వహించారు. 

ఇటీవల తుది కీ విడుదల చేయగా అందులో పలు తప్పులు ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలించి సవరించిన తుది కీ ఆధా రంగా డీఎస్సీ  ఫలితాలను విడుదల చేసినట్లు డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను, స్కోర్‌ కార్డులను పొందవచ్చని, స్పోర్ట్స్‌ కోటా వివరాలు అందిన తర్వాత తుది ఎంపిక జాబితా (సెలక్షన్‌ లిస్ట్‌) ప్రకటిస్తామని వివరించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, తుది కీపై వచ్చిన అభ్యంతరా­లకు ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఫలి­తాలు విడుదల చేసినట్లు విమర్శలు రావడం గమ­నార్హం. కాగా,   https:// apdsc. apcfss. in సెట్‌లో హాల్‌ టికెట్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి టెట్‌ వివరాలు సరిచేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చి­నట్లు  కన్వీనర్‌ తెలిపారు. ఈ  అవకాశం ఈ నెల 13వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)