Breaking News

AP: రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పింఛన్‌ పంపిణీ

Published on Mon, 05/01/2023 - 07:24

సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుఝాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందిస్తున్నారు వలంటీర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 63. 33 లక్షల మంది పెన్షనర్ల కోసం.. రూ. 1,747.38 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.

వైఎస్సార్‌ పెన్షన్ కానుక ద్వారా.. వృద్ధులు, దివ్యాంగులు, పలు రకాల చేతివృత్తిదారులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆసరా కోసం పింఛన్లు నెలవారీగా అందజేస్తూ వస్తోంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. ఈ నెలకుగానూ రూ. 1,747.38 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. పింఛన్ల పంపిణీ కోసం నిధులను శనివారమే ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయడు వెల్లడించారు.

పించన్ల పంపిణీలో ఏ సమస్యలు ఉన్నా.. అప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో సెర్ప్‌ కార్యాలయాల్లోనూ, జిల్లాల పరిధిలోని ఆయా డీఆర్‌డీఏ పీడీ కార్యాలయాల్లోనూ కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.

లబ్ధిదారులకు ఏమాత్రం శ్రమ, ఇబ్బందులు లేకుండా ఇంటికే వలంటీర్లు పెన్షన్లు వెళ్లి అందజేస్తూ వస్తున్నారు. ఈ జనసంక్షేమ పథకం కోసం నిధుల కేటాయింపు విషయంలో వెనకడుగు వేయట్లేదు సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.

ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో బయటపడ్డ మరో మార్గదర్శి స్కాం

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)