Breaking News

Laddu Row: సిట్‌ బ్రేకులపై డీజీపీ రియాక్షన్‌

Published on Tue, 10/01/2024 - 14:30

తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ అంశంపై సిట్‌ దర్యాప్తు నిలిపివేతపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. దర్యాప్తును తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారాయన.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆయన.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల లడ్డూ అంశంపై.. కేసు తీవ్రత వల్లే సిట్‌ వేయాల్సి వచ్చింది. అయితే సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. అందుకే  దర్యాప్తును ఆపుతున్నాం. తదుపరి సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు విచారణ వుంటుంది’’ అని తెలిపారాయన.

తిరుమల లడ్డూ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై నిన్న విచారణ జరిగింది. ఆ టైంలో.. సిట్‌ లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయించే అంశంపై అభిప్రాయం తెలియజేయాలని సోలిసిటర్‌ జనరల్‌ను ద్విసభ్య ధర్మాసనం కోరింది. అక్టోబర్‌ 3వ తేదీన తదుపరి విచారణ టైంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే ఐదోవ రోజు గరుడ వాహన సేవ రోజున అదనంగా భద్రతా ఏర్పాట్లు చేస్తాం. బ్రహోత్సవాల కోసం నాలుగు వేల మంది పోలీస్‌ సిబ్బందిని మోహరిస్తున్నాం. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా  చూస్తాం.

.. మొబైల్ డివైజ్ ఫింగర్ ప్రింట్  ఏర్పాట్లతో అనుమానితుల్ని గుర్తిస్తాం. 2,700 సీసీ కెమరాలతో పాటు అదనంగా బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాలో తప్పులు వార్తలు ప్రచారం కాకుండా నిఘా  ఉంచుతాం.  గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు వీక్షించే అవకాశం వుండగా.. అదనంగా 80 వేల మంది భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైనులు ద్వారా అనుమతిస్తాం.

మొత్తం.. 2.5 లక్షల మంది ప్రయాణించేలా గరుడ సేవ రోజున ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తేనే సౌకర్యవంతంగా వుంటుంది అని అన్నారాయన. అలాగే.. దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండబోవనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)