Breaking News

కేంద్ర మంత్రులతో సీఎం జగన్‌ చర్చించిన కీలకాంశాలివే

Published on Thu, 03/30/2023 - 09:09

సాక్షి, ఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. తన పర్యటనలో భాగంగా ఏపీకి సంబంధించిన పలు కీలకాంశాలను కేంద్రానికి నివేదించారు సీఎం జగన్‌. కేంద్రం మంత్రులతో.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో పాటు ఏపీకీ రావాల్సిన  నిధులు, బకాయిలపైనా ఆయన చర్చించారు. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఇవాళ ఉదయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.  

ఆర్థిక మంత్రితో సీఎం జగన్‌ చర్చించిన అంశాలివే..

►  ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలి.

►  రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా... రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు.  2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. 

►   తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. బకాయిలను వెంటనే ఇప్పించండి.

►   2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. వాటిని విడుదల చేసేలా చూడండి.  

►    పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలి. 

►   పోలవరం డయాఫ్రమ్‌వాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2, 020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంంది.  వెంటనే ఈ నిధులు విడుదల చేయాలి. 

►   పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2, 600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ అయ్యేలా చూడాలి. 

►     పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపాలి. దీంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా అంశాలను చర్చించారు సీఎం జగన్‌. 

►    రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారాయన. 


ఢిల్లీ పర్యటనలో భాగంగా..  బుధవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అరగంట భేటీ అయ్యారు.  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారాయన. 

హోం మంత్రి అమిత్‌ షాకి సీఎం జగన్‌ నివేదించిన కీలక అంశాలు.. 

►  విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాలనుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా కూడా ఈ హామీలు ఇచ్చింది. విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను.

►  పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను. 

►  అనూహ్య వరదల కారణంగా డయాఫ్రంవాల్‌ దెబ్బతింది. డయాఫ్రంవాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనావేసింది. ఈ డబ్బును వెంటనే విడుదలచేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

►   రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2,600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. 

►   పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. ఈ మొత్తానికి వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను. 

►    తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌వారీ నిబంధనలను సడలించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

►    పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అదిస్తే జాప్యాన్ని నివారించవచ్చు. 

►    2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరుతున్నారు. 

►    రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కన్నా ముందున్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడుకుందన్న కారణంతో ఇప్పుడు ఆంక్షలు విధించారు. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను.

►    తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. 

►    జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, రూ.56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇవ్వడంవల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలోఆంధ్రప్రదేశ్‌ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్‌ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్రం ప్రభుత్వం నెలకు వినియోగించని రేషన్ దాదాపు 3లక్షల టన్నులు ఉంటుంది. ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే సరిపోతుంది. దీనిపై దృష్టిపెట్టాలని కోరుతున్నాను. 

►    రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి.ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. 

►    కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్‌ కాలేజీలతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాను. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
 

ఇదీ చదవండి: ఏపీ తీర ప్రాంతాల.. అభివృద్ధి బాటలు

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)