Breaking News

చంద్రబాబు హెలికాప్టర్, విమాన చార్జీల అద్దెకు మరో రూ.10.92 కోట్లు

Published on Fri, 12/12/2025 - 04:26

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమాన ప్రయాణాల అద్దె కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.10.92 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు పరిపాలన అనుమతినిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక హెలికాప్టర్‌ లేదా ప్రత్యేక విమానం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తరచూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌–విజయవాడ మధ్య ప్రయాణిస్తున్నారు.

ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రత్యేక హెలికాప్టర్, విమాన చార్జీల అద్దె చెల్లింపుల కోసం మే నెల 22వ తేదీన రూ.19.12 కోట్లకు అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెపె్టంబర్‌ 18న రెండో త్రైమాసికంలో ప్రత్యేక హెలికాప్టర్, విమాన చార్జీల అద్దె చెల్లింపునకు మరో రూ.10.92 కోట్లకు అనుమతిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. తాజాగా మూడో త్రైమాసికంలో అనుమతిచ్చిన రూ.10.92 కోట్లతో కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమానాలకు అద్దె రూపంలో రూ.40.96 కోట్లను చెల్లించినట్లు అవుతోంది.   

చినబాబు, పవనూ ప్రత్యేక విమానాల్లోనే చక్కర్లు  
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా రూ.కోట్లాది రూపాయల ప్రజాధనం ఉపయోగించి ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలోనే చక్కెర్లు కొడుతున్నారు. అయితే వీరు తిరుగుతున్న విమానాల అద్దె లెక్కలు తేలాల్సి ఉంది.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)