Breaking News

హెల్త్‌ వర్సిటీ పేరు మార్పులో చంద్రబాబు అత్యుత్సాహం

Published on Tue, 06/25/2024 - 03:51

సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్య­సేవలు, విద్యార్థులకు వైద్య విద్యను అందించడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిన చంద్ర­బాబు హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పునకు మాత్రం అత్యుత్సాహం చూపించారు. రాష్ట్ర సచివాలయంలో సోమ­వారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్సార్‌ హెల్త్‌ యూని­వర్శిటీ పేరును ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శి­టీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడుసార్లు సీఎంగా చేసిన బాబు ఏనాడు ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోలేదు. పైగా ప్రైవేటు వైద్య కళాశాలలను, ప్రైవేటు ఆసుప­త్రులను ప్రోత్సహించి వైద్య వృత్తిని వ్యాపారం చేశారు.

కానీ, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే వైద్య­రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్‌ హయాంలో ఆరోగ్యశ్రీ, 108, 104 వ్యవస్థలను ప్రవేశపెట్టి వైద్యశాఖను బలోపేతం చేశారు. ఆయన తన­యుడైన జగన్‌ గడిచిన ఐదేళ్లలో వైద్యరంగం రూపురేఖలు మార్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. అలాగే, నాడు–నేడుతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఆధునీకరించారు.

ఈ నేపథ్యంలోనే.. వైద్య రంగాన్ని పేదలకు చేరువ చేసిన వైఎస్సార్‌ పేరును హెల్త్‌ యూనివర్శిటీకి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టింది. దీనికితోడు ఎన్టీఆర్‌ పేరును జిల్లాకు పెట్టి వైఎస్‌ జగన్‌ ఆదర్శంగా నిలిచారు. కానీ, రాజకీయ కక్ష సాధింపునకు కొనసాగింపుగా బాబు వైఎస్సార్‌ పేరును తొలగించి ఎన్టీఆర్‌ పేరు పెడుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు తప్పుబడుతున్నారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)