Breaking News

వలంటీర్ల వ్యవస్థకు మంగళం!

Published on Tue, 11/12/2024 - 05:10

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ఐదేళ్లపాటు ఎలాంటి అవినీతి, పక్షపాతం, పైరవీలకు తావులేకుండా సామాజిక పింఛను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నగదు అందజేసిన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసినట్టే. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌ ప్రతిపాదనల్లో వలంటీర్లకు ప్రతినెలా గౌరవ వేతనాల చెల్లింపుల కోసం నిధులే కేటాయించలేదు.

గ్రామ వలంటీర్ల వేతనాలకే 2022–23 ఆరి్థక ఏడాదిలో రూ.1,183.80 కోట్లు, 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.1,201.79 కోట్లను అప్పటి వైఎస్‌ జగన్‌ సర్కారు బడ్జెట్‌లో కేటాయించి వారికి చెల్లించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గ్రామ వలంటీర్లకు రూ.194.69 కోట్లు, వార్డు వలంటీర్లకు రూ.82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ మొత్తం కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌లో పొందుపర్చి ఏప్రిల్, మే నెలల్లో వలంటీర్లకు చెల్లించిన గౌరవ వేతనాల నిమిత్తమే ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపుల కింద చూపించారు.

ఆ రెండు నెలల కోసం వ్యయం చేసిన మొత్తం తప్ప.. తదనంతర 10 నెలల నిమిత్తం బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. వలంటీర్లకు ఇప్పటికే ప్రభుత్వం 5 నెలల వేతనాలు బకాయి పడింది. ఆ మొత్తంతోపాటు వచ్చే 5 నెలల వేతనాలు చెల్లించేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు.  

పట్టణాల్లో వార్డు వలంటీర్ల పరిస్థితీ అంతే..
పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వార్డు వలంటీర్ల వేతనాలకు సైతం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 2022–23 ఆర్థిక ఏడాదిలో వా­ర్డు వలంటీర్ల కోసం రూ.409.12 కోట్లు, 2023–24 ఆరి్థక ఏడాదిలో రూ.412.37 కోట్లను ప్రతిపాదించిన వైఎస్‌ జగన్‌ సర్కారు వారికి చెల్లింపులు చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో వార్డు వలంటీర్ల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇప్పటికే వార్డు వలంటీర్లకు చెల్లించిన ఏప్రిల్, మే నెలల వేతనాలకు ఖర్చు చేసిన మొత్తం తప్ప.. 5 నెలల పెండింగ్‌ వేతనాలు, వచ్చే 5 నెలల్లో చెల్లించాల్సిన వేతనాలకు పైసా కూడా కేటాయించలేదు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)