Breaking News

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

Published on Fri, 03/17/2023 - 08:52

Updates:

►ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.  

►శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులకు మంత్రి విడదల రజిని సవాల్ విసిరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాలం చెల్లిన మందులు చెల్లిస్తున్నారంటూ టీడీపీ ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. దమ్ముంటే చెల్లని మందులు ఎక్కడ ఉన్నాయో చూపించాలి.. ఏ ఆసుపత్రికైనా వెళ్ధాం రండి.. అంటూ మంత్రి సవాల్‌ చేశారు.

దళితుల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి నాగార్జున
దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశామని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దళితుల సంక్షేమానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దళితుల కోసం రూ.52 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టామన్నారు. దేశం గర్వించేలా విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సూక్ష్మసేద్యంలో ఏపీకి దేశంలో మంచి గుర్తింపు: మంత్రి కాకాణి
డ్రిప్‌ ఇరిగేషన్‌కు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.సూక్ష్మసేద్యంలో ఏపీకి దేశంలో మంచి గుర్తింపు లభించిందన్నారు. అవసరమైనవారందరికీ డ్రిప్‌ సదుపాయాన్ని అందిస్తామని మంత్రి అన్నారు.

రోడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి దాడిశెట్టి
►రోడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రహదారుల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 10,359 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశామన్నారు. ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో కొత్త రోడ్లను పూర్తి చేశామని మంత్రి అన్నారు.

► నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

►కాసేపట్లో నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చర్‌ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభం కానుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. శాసనమండలిలో 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతుంది. అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ నిర్వహించనున్నారు. అనంతరం బడ్జెట్‌పై శాసనమండలి చర్చ చేపట్టనుంది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)