Breaking News

108, 104 ఉద్యోగుల సమ్మె లేదు 

Published on Sun, 01/14/2024 - 03:45

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 108, 104 ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకున్నారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం గుంటూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారా­నికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ నెల 22 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు గుర్తింపు, గౌరవం: మంత్రి రజిని 
ఈ చర్చల్లో ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి రజిని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే దక్కాయని వివరించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి  తీసుకెళతామని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజిపైనా ప్రతిపాదనలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్‌ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతినెలా క్రమం తప్పకుండా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభు­త్వంలో 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు.

సీఎం జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా 104, 108 వ్యవస్థను, వాహ­నాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఈ విభాగాల్లోని ఉద్యో­గులకు కూడా ఏ సమస్యలు రానీయరని తెలిపారు. అత్యవసర సేవలు అందించే విషయంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్పదని చెప్పారు. 104, 108 ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకోవా­లని సూచించారు.

సీఎం జగన్‌ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు ఎలా సేవ చేస్తోందో, ఉద్యోగులకు కూడా ఏ సమస్యలూ రాకుండా చూస్తా­మని హామీ ఇచ్చారు. మంత్రి హామీలకు ఉద్యో­­గుల సంఘ నేతలు అంగీకరించారు. ఈ సమావేశంలో 108 ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్‌.మహేష్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.శ్రీనివాసరావు, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఫణికుమార్, ఉపాధ్యక్షుడు రాంబాబు, అరబిందో సంస్థ నుంచి ఎంవీ సత్యనారాయణ, రాకేష్‌ పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)