Breaking News

మరో భారీ అప్పు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం

Published on Tue, 12/30/2025 - 17:29

విజయవాడ: చంద్రబాబు నాయడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంం మరో భారీ అప్పు తెచ్చింది. తాజాగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది చంద్రబాబు సర్కారు. మంగళవారం నాడు  ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పును తెచ్చింది. రిజర్వ్‌  బ్యాంక్‌ వేలం ద్వారా అప్పు సమీకరించింది.  గడిచిన 18 నెలల్లో  రూ. 2.77 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ఫలితంగా అప్పుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది చంద్రబాబు సర్కారు.

చంద్రబాబు ప్రభుత్వం ఈనెల ఆరంభంలో  బడ్జెట్‌ లోపల  రూ.3,000 కోట్ల అప్పు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,000 కోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చింది

ఇలా బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్‌ సిక్స్‌లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్‌సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 17 కొత్త మెడికల్‌ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్‌ పరం చేస్తోంది.

కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారురూ. 2.77 లక్షల కోట్లకు  పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించట్లేదా అని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కానీ గత వైఎస్సార్‌సీపీ పాలనలో లేని అప్పులు కూడా ఉన్నట్లుగా ఎల్లో మీడియా ఇష్టారీతిన దుష్ప్రచారం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ బాబు అండ్‌ కో గగ్గోలు పెట్టిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు మెదపకపోవడం గమనార్హమని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)