Breaking News

ఏపీకి ‘సెనియార్‌’ తుపాను ముప్పు

Published on Sat, 11/22/2025 - 04:37

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారానికి దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది 24వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా, 26, 27 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు  పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత దీనికి సెనియార్‌ అని పేరు పెట్టనున్నారు (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌–యూఏఈ ఈ పేరు పెట్టనుంది). 

ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్‌ తీరానికి చేరే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ ప్రస్తుతం అంచనా వేసింది. పలు ప్రైవేటు గ్లోబల్‌ మోడల్స్‌ మాత్రం ఇది వాయవ్య దిశగా పయనించి ఏపీ, ఒడిశా, తమిళనాడు తీరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతలు అస్థిరంగా ఉండడంతో దీని కదలికలు ఇంకా అస్పష్టంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 

అండమాన్‌ సముద్రం, బంగాళాఖాతంలో ప్రస్తుతం 28 నుంచి 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలున్నాయి. కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ తేమ తగ్గుతోంది.  ఫలితంగా దాని గమనంపై అస్పష్టత నెలకొంది. 26వ తేదీ నాటికి దీని గమనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

	ఈనెల 26వ తేదీ నుంచి ఏపీలో పలు చోట్ల వర్షాలు

26 నుంచి వర్షాలు  
దీని ప్రభావంతో ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడతాయని తెలిపింది. 

సెనియార్‌ అంటే.. 
సెనియార్‌ అనే పేరును యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) పెట్టింది. ఈ పదం అరబిక్‌ భాషకు చెందినది. దీని అర్థం ‘చేపలు పట్టేందుకు నావలో చేసే సుదీర్ఘ ప్రయాణం’   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)