Breaking News

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

Published on Sat, 07/18/2026 - 15:40

విజయవాడ: ఏపీలో క్రమేపీ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురికి కోవిడ్‌-19 సోకగా, తాజాగా మరో కేసు నమోదైంది. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో కరోనా కేసు నమోదైంది. 13 ఏళ్ల బాలికకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన తిరువూరుకు చెందిన బాలికకు టెస్టులు చేయగా కోవిడ్‌గా తేలింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆ బాలికను కోవిడ్‌ వార్డుకు తరలించారు వైద్యులు.  

తాజా కేసులో ఏపీలో కోవిడ్‌ కేసుల సంఖ్య 16కు చేరింది. రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తించారు. పూణే ల్యాబ్ లో 4 శాంపిల్స్‌కు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా తేలింది. గొంతు నొప్పి,దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, ఒళ్లు నొప్పులు వంటివి  ఒమిక్రాన్ RF.5 లక్షణాలు.

కాగా,  దేశంలో మళ్లీ కోవిడ్‌ వ్యాప్తి వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 340కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో జూన్‌ 26 నుంచి శుక్రవారం వరకు నలుగురు కోవిడ్‌తో మృతిచెందారు.. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)