Breaking News

కోనసీమలో భారీగా గ్యాస్‌ లీక్‌..!

Published on Mon, 01/05/2026 - 14:05

మలికిపురం: మరోసారి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వాసుల్ని ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీకేజీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఇరుసుముండలో ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీకైంది. గ్యాస్‌ తీవ్రతతో మంటలు వంద అడుగుల మేర ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి విధులు నిర్వహిస్తున్న ఓఎన్‌జీసీ సిబ్బంది పరుగులు తీశారు. మంటలు వ్యాపిస్తుండడంతో ఇరుసుముండ గ్రామాన్ని దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ధాటికి వందలాది కొబ్బరి చెట్లు అగ్నికి బూడిదయ్యాయి. గ్యాస్‌లీకేజీపై సమాచారం అందుకున్న సమీప గ్రామాల ప్రజలు సైతం ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. 

 కోనసీమ జిల్లాలో  ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ నుంచి భారీగా గ్యాస్‌ లీక్‌ అవుతుంది. మలికిపురం మండలం ఇరుసమండ వద్ద భారీగా గ్యాస్‌ లీకేజ్‌ అవుతుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. పైప్‌లైన్‌ నుంచి భారీగా గ్యాస్‌ లీక్‌ అవుతుండటంతో  గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.  

 ఇక్కడ పదే పదే గ్యాస్‌ లీక్‌ అవుతున్న సందర్భాలను గర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు.  ఇది మరొక బ్లో అవుట్‌కు దారి తీస్తుందేమోనని భయం గుప్పెట్లో  ఉన్నారు కోనసీమ వాసులు. గతంలో పాశర్లపూడి వద్ద చోటు చేసుకున్న ఘటనను తలుచుకుంటున్నారు. ఈ గ్యాస్‌ లీక్‌ తొందరగా అదుపులోకి వస్తే ఫర్లేదు కానీ ఒకవేళ తీవ్రతరమైతే మరొకసారి తామ తీవ్ర ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందని  అంటున్నారు.  

కోనసీమలో ONGC గ్యాస్ లీక్ తగలబడుతున్న పొలాలు

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)