Breaking News

‘కొణతాల’ వారి కబ్జా కథ..

Published on Sun, 07/28/2024 - 06:05

సాక్షి, అనకాపల్లి: దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో చెలరేగిపోతున్న టీడీపీ–­జన­సేన­–­బీజేపీ కూటమి నేతల బరితెగింపునకు ఈ ఘటన మరో ఉదాహరణ. ఎంతో ఉన్న­తాశ­యంతో ఆరేడు దశాబ్దాల క్రితం దేవదాయ శాఖకు రాసిచ్చిన భూములపై కూటమి గద్దలు ఎప్పట్నుంచో కన్నేశాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చీరాగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తు­న్నా­యి. ఇప్పుడీ కబ్జా బాగోతాన్ని నడిపిస్తోంది అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబీకులు. ఈ భూదాహం కథాకమామిషు  ఏమిటంటే..

అనకాపల్లి పట్టణంలోని సర్వే నెంబరు 66లో 29.71 ఎకరాల భూమి (పూల్‌బాగ్‌ భూములు)ని చెముడు ఎస్టేట్‌ మహారాణి వైరిచర్ల చంద్రముఖి పట్టా మహాదేవి దేవదాయ శాఖకు 1957 జూలై 20న రిజిస్ట్రేషన్‌ చేసి మరీ అప్పగించారు. తన తదనంతరం దేవదాయ శాఖకు భూమిని అప్పగించాలని.. అప్పటివరకు ట్రస్టీలుగా తన పెద్ద అల్లుడు రాజూభీర్‌ ఉదిత్‌ ప్రతాప్‌ శంకర్‌ డియో, డాక్టర్‌ పేర్రాజు, న్యాయవాది రామచంద్రరావులను నియమించారు. 

ఆమె మరణానంతరం భూములను తమకు అప్పగించాలని ట్రస్టీని దేవదాయ శాఖాధికారులు 1963లో కోరారు. దీనిపై ట్రస్టీ కోర్టును ఆశ్రయించింది. 1996లో దేవదాయ శాఖకే అనుకూలంగా కోర్టు తీర్పువచ్చింది. ఆ తర్వాత చోటుచేసుకున్న వివిధ పరిణామాల తర్వాత దేవదాయ శాఖాధికారులు భూములను స్వాధీనం చేసుకుని భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేసి బోర్డులు ఏర్పాటుచేశారు. వాటి రక్షణకు సెక్యూరిటీని కూడా నియమించారు.

దేవస్థానం బోర్డులు పీకేసి..
నిజానికి.. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామ­కృష్ణ కుటుంబ సభ్యులు అనకాపల్లిలోని కనక­మహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాల­యం అంబి­కాబాగ్‌ రామాలయానికి చెందిన ఈ భూములను హస్తగతం చేసుకోవడానికి ఎప్పటినుంచో కన్నే­శారు. అందులో భాగంగా.. కోర్టు ఇంటెరిం ఆర్డర్‌ పేరిట 29.71 ఎకరాల ఈ భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అక్కడున్న దేవస్థానం బోర్డుల్ని 2022 నవంబర్‌ 27నే పీకేశారు. 

వాటి స్థానంలో ఆ భూములు తమవేనని, న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంటూ కొణ­తా­ల రామకృష్ణ సోదరుడి మావయ్య అయిన బీవీఏఎస్‌ నాయుడు పేరిట బోర్డులు వెలి­శా­యి. దీంతో వీరిపై అనకాపల్లి టౌన్‌ పోలీ­స్‌స్టేషన్‌లో అప్పటి దేవదాయ శాఖ ఏసీపీ శిరీష ఫిర్యాదు చేయగా బోర్డులు పీకేసిన ఆరు­గురిపై సీఐ దాడి మోహన్‌ కేసు నమో­దుచేశారు. 

ఈ నేపథ్యంలో.. శనివారం ఆ భూమిని మళ్లీ ఆక్రమించేందుకు కొణ­తాల రామకృష్ణ సోదరుడు రఘుబాబు భార్య రజనీ, ఆయన బావమరిది బొడ్డేటి శ్రీనివా­స­రావు అనుచరులు సిద్ధమయ్యారు. జేసీబీ­తో ఆ భూములను చదును చేసేందుకు యత్నించారు. కనక­మ­హాలక్ష్మి దేవస్థానం ఏఈవో రాంబాబు, దేవదాయ ఏఈ కె.సూర్య­నారా­యణమూర్తి, సిబ్బంది, సీపీ­ఎం జిల్లా కార్య­దర్శి కె.లోకనాథం, సీఐటీ­యూ నాయకులు శ్రీరామ్, శ్రీనివాస్‌ అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. 

కోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ కోర్టుకు
ఈ వ్యవహారం కోర్టులో నడు­స్తుండగానే.. ఆ భూమిలో కొణతాల రామ­కృష్ణ, ఆయన సోదరులు రైతులతో సాగు చేయించడం ప్రారంభించారు. తద్వారా మొత్తం 30 మంది రైతుల నుంచి రూ.10వేల చొప్పున కౌలు వసూలుచేస్తున్నారు. అంతేకాక.. ఇవి తమ భూములేనంటూ వివిధ ఆక్రమణదారుల పేరుతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. హఠాత్తుగా శనివారం మరోసారి దేవదాయ శాఖ బోర్డుల్ని తొలగించి వాటి స్థానంలో బీవీఏఎస్‌ నాయుడు పేరిట బోర్డులు పెట్టారు. దీంతో ఆలయ బోర్డు చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు నాయుడు పేరిట ఉన్న బోర్డులు తొలగించారు. 

నాయుడుతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దేవదాయశాఖ భూములను కాపాడతాంగతంలో కోర్టు నాలుగు వారాలపాటు స్టే ఇస్తే.. దేవస్థానం బోర్డులు పీకేసీ బీవీఏఎస్‌ నాయుడు పేరిట బోర్డులు ఏర్పాటుచేశారు. అప్పుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆరుగురిపై కేసులు నమోదుచేశారు. మళ్లీ శనివారం ఉదయం జేసీబీలతో ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా అడ్డుకున్నాం. దేవదాయశాఖ భూములను కాపాడడమే మా లక్ష్యం. – రాంబాబు, కనకమహాలక్ష్మి ఆలయ ఏఈఓ, అనకాపల్లి 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)