Breaking News

వసంతోత్సవాలకు అంకురార్పణ

Published on Wed, 05/22/2024 - 05:26

చంద్రగిరి (తిరుపతి జిల్లా):  తిరుచానూరులో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. వసంతోత్సవాలకు అవరోధాలు కలగకుండా సకల దేవతలను కోరుతూ మంగళవారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు అంకురార్పణ నిర్వహించారు. 

అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. యాగశాలలో సిద్ధంగా ఉంచిన నవపాళికలలో పుట్టమన్ను నింపి, అందులో నవధాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టడంతో వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల సందర్భంగా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యానవనంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు తిరువీధోత్సవం నిర్వహించనున్నారు.  

రేపు స్వర్ణరథోత్సవం 
వసంతోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం 7.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. వసంతోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. 

స్నపన తిరుమంజనం జరిగే మండపం చుట్టూ చల్లదనం కోసం వట్టివేళ్లతో తెరలను ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునేలా రంగోళి, అమ్మవారి చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలు, విద్యుత్‌ దీపాలంకరణతో ఉద్యానవనం నూతన శోభను సంతరించుకుంది. అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్‌ మధు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)