Breaking News

యజమాని కారు ఢీకొని యువకుడి మృతి

Published on Sun, 11/16/2025 - 12:04

అన్నమయ్య జిల్లా: అప్పటి వరకు తన యజమాని కుమార్తె పుట్టిన రోజు పార్టీలో సరదాగా గడిపిన ఓ యువకుడు.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన యజమాని కారు ఢీకొనే చనిపోయాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... కలికిరి పంచాయతీ సత్యాపురంలో నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్‌ ముంగర రామకృష్ణరాజు, సుకన్య కుమారుడు వినీత్‌కుమార్‌రాజు(25) కలికిరి క్రాస్‌ రోడ్డు­లోని అబు మొబైల్స్‌ దుకాణంలో పని చేస్తు­న్నాడు. దుకాణం యజమాని అబు కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రాత్రి రాయ­చోటిలో పార్టీ ఇచ్చాడు. అబు కారులోనే స్నేహి­తులైన వినీత్‌కుమార్‌రాజు, నౌషాద్‌ బాషా (బబ్లూ), అహ్మద్, నరేష్‌ వెళ్లారు. 

అక్కడ అందరూ మద్యం తాగి, రాత్రి 11 గంటలకు కలికిరికి బయలుదేరారు. కలికిరి క్రాస్‌ రోడ్డులోని మొబైల్‌ దుకాణం వద్ద యజమాని అబు, అహ్మద్‌ కారు దిగిపోగా, డ్రైవరుగా ఉన్న బబ్లూ అక్కడి నుంచి వినీత్‌కుమార్‌రాజు, టి.మాదిగపల్లికి చెందిన నరే­ష్‌ను వారి ఇళ్ల వద్ద దింపడానికి బయలుదేరాడు. సత్యాపురంలో వినీత్‌కుమార్‌రాజును దింపేసిన అనంతరం అక్కడి నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న టి.మాదిగపల్లిలో నరేష్‌ ను దింపాడు. తిరిగి వచ్చేటప్పుడు సత్యాపురంలో రోడ్డు పక్కన ఉన్న వినీత్‌కుమార్‌రాజును కారుతో ఢీకొట్టాడు. ఈ విషయం బబ్లూ తన స్నేహితుడు అహ్మద్‌కు తెలియజేశాడు. 

వెంటనే అహ్మద్‌ అక్కడికి చేరుకున్నాడు. కానీ, స్థానికులు రావడంతో బబ్లూ, అహ్మ­ద్‌ పారిపోయారు. దీంతో స్థానికులు 112 నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే వినీత్‌కుమార్‌రాజు మృతిచెందాడు. శనివారం వేకువజామున మూడు గంటలకు వినీత్‌కుమార్‌రాజు కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనాస్థలాన్ని సీఐ అనిల్‌కుమార్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన 
శుక్రవారం అర్ధరాత్రి తమ కుమారుడు చనిపోతే శనివా­రం ఉదయం నుంచి ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు­న్నా­రని మృతుని తల్లి సుకన్య, బంధువులు శనివారం సాయంత్రం 6 గంటలకు స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే తమకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని సీఐ వెల్లడించారు. ఆందోళన అనంతరం రాత్రి మీడియా ముందు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన సీఐ అనిల్‌కుమార్‌.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మొబైల్‌ దుకాణం యజమాని అబు, కారుడ్రైవర్‌ బబ్లూ(నౌషాద్‌ బాషా), నరే‹Ù, అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)