Breaking News

సర్కారు తీరుపై కదం తొక్కిన యానిమేటర్లు

Published on Wed, 03/12/2025 - 05:11

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు సంఘ కార్యకలాపాల్లో సహాయకారులుగా పనిచేసే వెలుగు వీవోఏలు (గ్రామ సమాఖ్య సహాయకులు–డ్వాక్రా యానిమేటర్స్‌) కూటమి ప్రభుత్వ తీరుపై కదం తొక్కారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘కూటమి అధికారంలోకి వచ్చాక 4,500 మందిని తీసేశారు. అధికార పార్టీ నేతలు తమ వారిని నియమించుకునేందుకు 25 ఏళ్లుగా పనిచేస్తున్న వీవోఏలను అన్యాయంగా తొలగిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?’ అని నిలదీశారు. 

మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది వీవోఏలు విజయవాడ చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడ ధర్నా చౌక్‌ దద్దరిల్లింది. అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కనీస వేతనాలు వర్తింపజేయాలని, 3 నెలల గౌరవ వేతన బకాయిలను వెంటనే విడుదల ఇవ్వాలని, రూ.10 లక్షలు బీమా అమలు చేయాలని  డిమాండ్‌ చేశారు. మండల సమాఖ్యలో అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏకమై కొత్త పుస్తకాలు తెచ్చుకుని, కొత్త వీవోఏల పేర్లు రాసుకుని ఆన్‌లైన్‌లో ఎక్కించుకుంటున్నారని ఆరోపించారు. 

‘వీవోఏలకు మూడేళ్ల కాల పరిమితి విధిస్తూ అమల్లో ఉన్న సర్క్యులర్‌ రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల ముందు స్పష్టంగా హామీ ఇచి్చంది. గెలిచాక ఇప్పుడు ఆ సర్క్యులర్‌ మంచిదే కదా? అంటూ మాట మార్చారు’ అని ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి విమర్శించారు. వీవోఏలకు పని ఒత్తిడి ఎక్కువైందని, ఇవి చాలదని రాజకీయ పార్టీలు ఉద్యోగుల తొలగింపునకు దిగుతున్నాయని దుయ్యబట్టారు. పొదుపు సంఘాల మహిళల ఉత్పత్తుల ఆన్‌లైన్‌ అమ్మకాల కోసం వీవోఏలకు టార్గెట్లు పెట్టడాన్ని ఆపాలని వీవోఏలు డిమాండ్‌ చేశారు. 

తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించకుంటే పోరాటాన్ని  ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ఆందోళనకు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మద్దతు ప్రకటించారు. వీవోఏల సంఘం అధ్యక్షురాలు సీహెచ్‌ రూపాదేవి, సీఐటీయూ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, వీవోఏ సంఘం కోశాధికారి ఎ.తిరుపతయ్య, ఉపాధ్యక్షులు ఎ.నిర్మలాదేవి, కె.లక్ష్మి ఆందోళనకు నాయకత్వం వహించారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)