Breaking News

టీటీడీ ఈఓ సహా పలువురు ఐఏఎస్‌ల బదిలీ..

Published on Tue, 09/09/2025 - 04:56

సాక్షి, అమరావతి :  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈఓ)తో సహా పలువురు ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ ఈఓగా రెండేళ్ల పదవీ కాలం పూర్తికాకుండానే జె. శ్యామలరావును తప్పించింది. గతంలో చంద్రబాబు సర్కారులో పనిచేసిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను మళ్లీ టీటీడీ ఈఓగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 

శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కొన్ని శాఖల కార్యదర్శి, కమిషనర్‌ పోస్టులు రెండూ ఒక్కరికే అప్పగించింది. అంటే.. కమిషనర్‌గా ఆయనే ప్రతిపాదనలు పంపుతారు, కార్యదర్శిగా ఆయనే నిర్ణయాలు తీసుకుంటారు. 

ఇలా.. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్‌ శ్రీధర్‌ను నియమించగా, ఆయనకే మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్‌ పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. అలాగే, కారి్మక శాఖ కార్యదర్శిగా ఎంవీ శేషగిరిబాబును నియమించారు. ఆ శాఖ కమిషనర్‌గా కూడా ఆయనకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)