Breaking News

సంక్షేమ పథకాలు వర్తింపజేయండి

Published on Tue, 06/24/2025 - 04:26

సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలను అంగన్‌వాడీ కార్యకర్తలకు వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల ఎదుట సోమవారం ధర్నాలు జరిగాయి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని, మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ అంగన్‌వాడీలుగా మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, వేతనాలను పెంచాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్లకు, అధికారులకు సమరి్పంచారు. విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన ధర్నాలో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగుల జాబితా నుంచి తొలగించాలన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని పరిగణించడంతో సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసిందని, వాస్తవానికి వర్కర్లకు రూ.11,500, హెల్పర్లు, మినీ వర్కర్లకు రూ.7 వేలు మాత్రమే జీతం ఇస్తున్నప్పటికీ వారికి పథకాలు అందడం లేదన్నారు. 

ధర్నా అనంతరం ఆటోనగర్‌లోని గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న యూనియన్‌ నాయ­కులు, అంగన్‌వాడీ వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య తీవ్ర వాగి్వవాదం జరిగింది. చివరకు పోలీసులు అడ్డు తప్పుకోవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ అదనపు డైరెక్టర్‌ సూర్యనారాయణకు వినతిపత్రం అందించారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)