Breaking News

ఈ ఫోన్లు మాకొద్దు బాబోయ్‌!

Published on Tue, 08/05/2025 - 02:17

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు సోమవారం నుంచి ప్రభుత్వంపై వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక యాప్‌లో డేటా అప్‌డేట్‌ చేసే భారాన్ని పెంచడంతో మొబైల్‌ ఫోన్ల స్పీడ్‌ సరిపోక నానా అవస్థలు పడుతున్నామని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శికి అనేకసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ  నిరసన చేపట్టామన్నారు. 

‘యాప్‌ల భారం తగ్గించండి.. ఈ ఫోన్లు మాకొద్దు’ అంటూ తమ పరిధిలోని చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ (సీడీపీఓ)లకు వాటిని అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం తమ వద్ద మొబైల్‌ ఫోన్లను చక్కగా ప్యాక్‌చేసి సీడీపీఓలకు అందించారు. కొన్నిచోట్ల వాటిని తీసుకోగా, మరికొందరు తీసుకోవడానికి నిరాకరించారు. అయితే, తమ మొబైల్‌ ఫోన్లను సీడీపీఓలు తీసుకున్నా తీసుకోకపోయినా మంగళవారం నుంచి డేటా అప్‌డేట్‌ చేసేదిలేదని అంగన్‌వాడీ వర్కర్లు తెగేసి చెబుతున్నారు. 

ఎఫ్‌ఆర్‌ఎస్‌కు అవస్థలు 
ఇక ప్రతి అంగనవాడీ కేంద్రం పరిధిలోను లబ్ధిదారులైన గర్భిణి, మూడేళ్లలోపు చిన్నారుల తల్లికి సంబంధించి నెలలో రెండుసార్లు ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేస్‌ రికగ్నేషన్‌) చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పోషణ్‌ ట్రాకర్‌’ యాప్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘బాల సంజీవిని’ యాప్‌లలో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వాటిలో ఎఫ్‌ఆర్‌ఎస్, ఓటీపీ, ఈకేవైసీ, ఆధార్, మొబైల్‌ అప్‌డేట్‌ వంటి వాటిని రెండు యాప్‌ల్లోను నెలనెలా రెండేసిసార్లు చేయాలి.

ఇందుకు తమ మొబైల్‌ ఫోన్ల స్పీడ్‌ సరిపోవడం లేదని, ఒక్కసారి పూర్తిచేయాలంటేనే 20 రోజులు పడుతోందని అంగన్‌వాడీ వర్కర్లు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెండు యాప్‌లను ఒక యాప్‌గా మార్చాలని.. 2జీబీ ర్యామ్‌ మొబైల్‌ ఫోన్ల స్థానంలో వేగంగా పనిచేసే వాటిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. దీంతో.. మొబైల్‌ ఫోన్లు ఇచ్చేసే నిరసన చేపట్టినట్లు అంగన్‌వాడీ వర్కర్లు చెబుతున్నారు.

నేటి నుంచి మొబైల్‌ ఫోన్లు బంద్‌ 
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచకుండా కూటమి ప్రభుత్వం పనిభారం పెంచుతోంది. సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదు. యాప్‌ల భారం తగ్గించాలని అంగన్‌వాడీలకు చెందిన మూడు యూనియన్ల రాష్ట్ర నాయకుల బృందం కూటమి ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. అయినా, ఫలితం లేకపోవడంతో మొబైల్‌ ఫోన్‌ అప్పగింత ఆందోళన చేపట్టాం.

అలాగే, మంగళవారం నుంచి మొబైల్‌ ఫోన్లను బంద్‌చేసి యాప్‌లలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ చేయబోమని ఇప్పటికే అధికారులకు తేల్చిచెప్పాం. ఇక గౌరవ వేతనం బకాయిలు ఐదునెలలుగా పేరుకుపోయాయి. బిల్లులు, వేతనాలు నెలనెలా ఇచ్చేలా ప్రభు­త్వం చర్యలు తీసుకోవాలి. సోనా మసూరి బియ్యం ఇచ్చి మెనూ ఛార్జీలు పెంచాలి.  అంగన్‌వాడీలకు ఇతర యాప్‌లు, పథకాలకు సంబంధించిన భారాలను అప్పగించకూడదు.  – జె.లలితమ్మ, ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్స్‌ అసోసియేషన్‌

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)