Breaking News

డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Published on Fri, 07/10/2026 - 12:35

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు కనీసవేతనం రూ. 26 వేలతో పాటు పెన్షన్, వైద్యసదుపాయం కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు ఆందోళనకు దిగారు. ఈ రోజు (శుక్రవారం) జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిరసనలు చేపట్టారు. విశాఖ జగదాంబ జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రకటించిన విధంగా జీతాన్ని వెంటనే పెంచి కార్యకర్తలపై రాజకీయ వేధింపులను ఆపాలని కోరారు. ప్రస్తుతం వాడుతున్న నవచేతన యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తిరుపతిలో జిల్లా కలెక్టరేట్ ఎదుట  అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన చేపట్టారు.సీ.ఐ.టీ.యు నేత కందారపు మురళి నేతృత్వంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాది మంది అంగన్వాడి వర్కర్లు తో రిలే నిరాహారదీక్ష చేపట్టారు.అంగన్వాడి వర్కర్ లకు ఈ.ఎస్. ఐ, పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలు అంగన్వాడి వర్కర్ లకు అందించాలన్నారు.

కాగా  ప్రభుత్వం  అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలతో పాటు పెన్షన్, PF, ESI సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టారు. పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు సేవలంధిస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలకు పిలుపిచ్చారు.ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు, 48,770 మినీ కేంద్రాలు ఉన్నాయి. 

జీతం 26 వేలు ఇవ్వాల్సిందే.. రోడ్డెక్కిన అంగన్వాడీలు

ప్రధాన డిమాండ్లు 

● సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగన్‌వాడీలకు రూ.26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలు కల్పించాలి.

● అంగన్‌వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయడంతో పాటు, గుజరాత్‌ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జీతాలు పెంచాలి.

● మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్‌కు 5 ఏళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలి.

● అంగన్‌వాడీలకు ‘తల్లికి వందనం’ సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.

● సిగ్నల్‌ సమస్యలతో తీవ్ర ఇబ్బంది పెడుతున్న ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ఫేస్‌ యాప్‌ను, పనిభారం పెంచే నవచేతన యాప్‌ను తక్షణమే రద్దు చేయాలి. పెండింగ్‌లో ఉన్న టీఏ, మెయింటినెన్స్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)