Breaking News

హామీలు అమలు చేయమంటే అంగన్‌వాడీలపై దౌర్జన్యమా!

Published on Wed, 03/04/2026 - 05:49

సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని శాంతియుత నిరసన తెలిపిన అంగన్‌వాడీలను ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులతో అరెస్టులు చేయించడాన్ని వైఎస్సార్‌టీయూసీ అనుబంధ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌ తీవ్రంగా ఖండించింది. విజయవాడలో అంగన్‌వాడీలను పాశవికంగా అరెస్టు చేయడాన్ని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కాల్వపల్లి చిన్నమ్మ, ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళ  తప్పుబట్టారు.

ఈ మేరకు మంగళవారం ప్రకటన చేస్తూ.. అంగన్‌వాడీ మహిళల పట్ల మగ పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన తీరుపై హోంమంత్రిగా ఉన్న మహిళ సమాధానం చెప్పాలన్నారు. గతంలో అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మహిళల ఆగ్రహానికి గురయ్యారన్నారు. న్యాయమైన డిమాండ్ల  సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నించి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
అంగన్‌వాడీ మహిళల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు హెచ్చరించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మి, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ అనుబంధ యూనియన్ల నాయకులు లక్ష్మీదేవి. జైని, రత్నకుమారి, లలితమ్మ, సుజాత తదితరులు విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీలు నిద్రమత్తులో ఉండగా ప్రభుత్వం దుర్మార్గంగా అక్రమ అరెస్టులకు పాల్పడిందన్నారు.

అరెస్టు చేసిన వారిని వెంటనే  బేషరతుగా విడుదల చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్‌లో పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే, శాంతియుతంగా ధర్నా చేసిన అంగన్‌వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి. అంగన్‌వాడీలు నిద్రిస్తుండగా తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డాయి. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)