Breaking News

ఏయూ విద్యార్థులపై రిజిస్ట్రార్‌ దౌర్జన్యం

Published on Wed, 07/23/2025 - 11:06

సాక్షి, విశాఖపట్నం: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులపై రిజిస్ట్రార్‌ దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులు మీడియా ముందు సమస్యలు చెప్పుకుంటున్న సమయంలో వాళ్ల చేతుల్లోంచి మైకు లాక్కున్నారు. పూర్తిగా సమస్యలు వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారాయన. 

ఏయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతమైంది. పురుగుల అన్నం పెడుతున్నారని, తమ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏయూ రిజిస్ట్రార్‌కు నిరసన సెగ తాకింది. గత రాత్రి నుంచి ఏయూ మెయిన్‌గేట్‌ వద్ద కొనసాగిన ఆందోళన.. ఈ ఉదయం రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకుంది.

 పురుగుల అన్నం మాకొద్దు.. నాణ్యమైన ఆహారం అందించాలంటూ నినాదాలు చేశారు.  ఆపై రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని.. లేకుంటే వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ సమయంలో పోలీసులతో విద్యార్థులకు వాగ్వాదం జరిగింది.

యూనివర్సిటీలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని, అవి మారాలంటూ కొంతకాలంగా విద్యార్థులు పోరాడుతున్నారు. ఈ క్రమంలో గత రాత్రి నుంచి అధికారులు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అయితే అర్ధరాత్రి దాటాక ఒక దశలో ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థుల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు.. వాళ్లు వినకపోవడంతో బెదిరింపులకు దిగారు. ఏసీపీ లక్ష్మణమూర్తి తమపై కేసులు పెడతామని బెదిరించినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. 

అయితే.. విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్నిసార్లు చెప్పిన తమ సమస్యలపై ఏయూ అధికారులు స్పందించడం లేదని, అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించేదని కుండబద్ధలు కొడుతున్నారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)