Breaking News

జేఈఈ మెయిన్‌లో ఏపీ విద్యార్థుల సత్తా

Published on Tue, 02/17/2026 - 05:30

సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌–1లో ఆంధ్రా విద్యార్థులు సత్తా చాటారు. జనరల్‌తో పాటు ఓబీసీ, ఎస్సీ విభాగాల్లో దేశంలో టాప్‌ స్కోర్లు సాధించారు. సోమవారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ సెషన్‌–1 స్కోర్లలో ఏకంగా 12 మంది 100 పర్సంటైల్‌తో సత్తా చాటారు. వీరిలో రాజస్థాన్‌ నుంచి అత్యధికంగా ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరు, ఢిల్లీ, బిహార్, ఒడిశా, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఒక్కొక్క అభ్యర్థి ఉండటం విశేషం.

ముఖ్యంగా ఏపీ నుంచి 100 పర్సంటైల్‌ సాధించిన నరేంద్రబాబుగారి మహిత్‌ రాష్ట్రంలో టాపర్‌గా నిలవడమే కాకుండా ఓబీసీ–ఎన్‌సీఎల్‌ కేటగిరీలో దేశంలో టాపర్‌గా ఘనత సాధించారు. 100 పర్సంటైల్‌ సాధించిన మరో అభ్యర్థి పసల మోహిత్‌ జనరల్‌ కేటగిరీలోని టాపర్లలో ఒకరిగా నిలిచారు. ఎస్సీ కేటగిరీలో 99.99 పర్సంటైల్‌ స్కోర్‌తో దేవ శ్రీవేధ్‌ దేశంలోనే టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. మహిళల విభాగంలో హర్యానాకు చెందిన ఆషి అగర్వాల్‌ 99.99 పర్సంటైల్‌ స్కోర్‌తో టాపర్‌గా ఉన్నారు.  

96.26 శాతం హాజరు నమోదు
జేఈఈ మెయిన్‌ తొలి సెషన్‌కు 13,55,293 మంది రిజి్రస్టేషన్‌ చేసుకోగా.. 13,04,653 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే నమోదు చేసుకున్న వారిలో 96.26 శాతం మంది పరీక్ష రాశారు. దేశంలోని సిటీలతో పాటు భారతదేశం వెలుపల 15 సిటీలతో కలుపుకుని మొత్తం 326 సిటీల్లో ఎన్టీఏ పరీక్షలు నిర్వహించింది. పురుషులు 8,87,476 మంది, మహిళలు 4,67,817 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. వీరిలో పురుషులు 8,55,085 మంది, మహిళలు 4,49,568 మంది హాజరయ్యారు. అయితే.. 68 మంది అభ్యర్థుల స్కోర్లను మాత్రం ఎన్టీఏ వెల్లడించలేదు. పరీక్షల్లో అనైతిక చర్యలకు పాల్పడి న నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్టు పే ర్కొంది. సెషన్‌–2 పరీక్షల అనంతరం ఉత్త మ స్కోర్‌లను పరిగణనలోకి తీసుకుని తుది ర్యాంకులు ప్రకటిస్తామని వివరించింది.  

100 పర్సంటైల్‌సాధించిన అభ్యర్థులు వీరే
1. శ్రేయాస్‌ మిశ్రా (ఢిల్లీ) 
2. నరేంద్రబాబుగారి మహిత్‌ (ఏపీ) 
3. శుభం కుమార్‌ (బిహార్‌) 
4. కబీర్‌ చిల్లర్‌ (రాజస్థాన్‌) 
5. చిరంజీబ్‌ కర్‌ (రాజస్థాన్‌) 
6. భవేష్‌పాత్ర (ఒడిశా) 
7. అనై జైన్‌ (హర్యానా) 
8. అర్నవ్‌ గౌతమ్‌ (రాజస్థాన్‌) 
9. పసల మోహిత్‌ (ఏపీ) 
10. మాధవ్‌ విరాడియా (మహారాష్ట్ర) 
11. పురోహిత్‌ నిమయ్‌ (గుజరాత్‌) 
12. వివాన్‌ శరద్‌ మహేశ్వరి (తెలంగాణ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)