Breaking News

ఆంధ్ర వర్సెస్‌ తమిళనాడు పోలీసు

Published on Mon, 03/03/2025 - 06:11

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: కుప్పం మీదుగా కర్ణాటకకు తరలిస్తున్న తమిళనాడు బియ్యం అక్రమ రవాణా కలకలం రేపింది. దీనిని అరికట్టేందుకు తమిళనాడు పోలీసులు ఆంధ్ర వాహనాల వెంటపడ్డారు. దీంతో.. తమకు సమాచారం లేకుండా ఆంధ్ర ప్రాంతంలో దాడులు ఏమిటని ఏపీ  పోలీసులు తమిళనాడు పోలీసులను నిలదీశారు. ఈ విషయం కుప్పం నియోజకవర్గంలో ఆదివారం చినికి చినికి గాలివానైంది. చివరికి.. ఏపీకి వచ్చిన తమిళనాడు పోలీసులను కుప్పం పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టడం వివాదాస్పదమైంది. వివరాలివీ.. 

తమిళనాడు పోలీసులను పట్టుకున్న ఆంధ్ర పోలీసులు.. 
తమిళనాడు బియ్యాన్ని కుప్పం మీదుగా కర్ణాటకకు తరలించేందుకు శాంతిపురానికి చెందిన ఓ టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు ప్రోత్సహిస్తున్నాడనే సమాచారం మేరకు తమిళనాడు పోలీసులు శనివారం రాత్రి నిఘా ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శాంతిపురం మండలం, గెసికపల్లి మార్గంలో ఓ బియ్యం వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. 

సమాచారం తెలుసుకున్న కుప్పం పోలీసులు తమిళనాడు పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. కుప్పం సీఐ కార్యాలయానికి తమిళనాడు పోలీసులను తరలించారు. దీంతో తమిళనాడు పోలీసులు భారీగా తరలివచ్చి ఇదేమ­ని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు కలుగజేసుకుని తమిళనాడు పోలీసులను విడిచిపెట్టారు. కాగా.. బియ్యం అక్రమ రవాణాలో హస్తమున్న ఓ ప్రధాన నాయకుడే ఆంధ్ర పోలీసులపై ఒత్తిడితెచ్చి తమిళ పోలీసులను అడ్డుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

టీడీపీ కూటమి నాయకుల తప్పుడు కార్యకలాపాలవల్లే ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య సమ­స్య­లు తలెత్తినట్లయ్యింది. దీనిపై కుప్పం రూరల్‌ సీఐ మల్లేష్‌యాదవ్‌ను వివరణ కోరగా.. కుప్పం ప్రాంతంలో కొంతమంది వచ్చి దాడులు చేస్తున్నారన్న సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమన్నారు. తీరా విచారణ చేపట్టాక వారు తమిళనాడు పోలీసులని తేలిందని చెప్పారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని విడిచిపెట్టినట్లు ఆయన వివరించారు. 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)