Breaking News

సచివాలయ ఉద్యోగులకు మరోసారి బదిలీలు

Published on Tue, 11/18/2025 - 05:36

సాక్షి, అమరావతి: గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు స్పౌజ్‌ కేటగిరిలో ఒక జిల్లా నుంచి మరో జిల్లా బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలంటూ గ్రామ/వార్డు సచివాలయా­ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ సోమవా­రం ఆదేశాలు జారీ చేశారు. బదిలీలు పూర్తిగా ఉద్యోగి అభ్యర్థన ప్రాతిపదికన మాత్రమే ఉంటా­యని, అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. క్రమశిక్షణ చర్యలకు గురైన వారు, విజిలెన్స్‌ కేసులు నమోదైన వారి అభ్యర్ధనలు పరిగణనలోకి తీసుకోబోరని వెల్లడించా­రు.

భార్యాభర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్, కో–ఆపరేటివ్, ఎయిడెడ్‌ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్న వారు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, భర్త లేదా భార్యలో ఒకరు ప్రైవేట్‌ ఉద్యోగి అయితే ఈ ప్రక్రియలో బదిలీలకు అర్హత ఉండదని స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలోనే ఉద్యోగులు వారికి కావాల్సిన మండలాలు లేదంటే మున్సిపాలిటీలను ఎంపిక చేసుకోవచ్చని, ప్రభుత్వం కూడా బదిలీల ప్రక్రియలో కొత్త జిల్లాలో మండలాలు లేదంటే మున్సిపాలిటీలను ఆయా ఉద్యోగులకు కేటాయిస్తూ ఆదేశాలు ఇస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత మండలాలు లేదంటే మున్సిపాలిటీల్లో ఖాళీల మేరకు కౌన్సిలింగ్‌ ప్రక్రియలో నిర్ణీత సచివాలయం కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థుల మెరిట్‌ ర్యాంక్‌ ఆధారంగా సీరియల్‌గా ఈ బదిలీల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)