Breaking News

సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ

Published on Sun, 01/01/2023 - 11:54

సాక్షి, అమరావతి: దేశంలోనే సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీకి 2020, 2021  సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒక లక్ష హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఇటీవల లోక్‌ సభలో వెల్లడించారు. 2019–20 నుంచి ఇప్పటివరకు ఏపీలో 1,44,465 హెక్టార్లు సేంద్రీయ వ్యవసాయం కిందకు వచ్చిన­ట్లు తెలిపారు.

2020–21లో భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద 8 రాష్ట్రాల్లో 4.09 లక్షల హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతి ఇచ్చామన్నారు. ఇందులో అత్యధికంగా ఏపీలో లక్ష హెక్టార్లకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన పథ­కం, భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపా­రు.
చదవండి: వాహ్‌ వైజాగ్‌.. సాటిలేని మేటి సిటీ

2019–20 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాల కింద సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక సా­యం అందించడంతో పాటు శిక్షణ, సామర్ధ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్లలో రైతుల క్లస్టర్ల ఏర్పాటు, సామర్ధ్యం పెంపునకు హెక్టార్‌కు రూ.12,200 సాయాన్ని అందించినట్లు చె­ప్పారు. హ్యాండ్‌ హోల్డింగ్, సర్టిఫికేషన్, అవశేషాల విశ్లేషణ్‌కు హెక్టారుకు మూడేళ్లలో రూ. 2 వేల ఆర్థిక సా­యం అందించామన్నారు. సహజ సేద్య ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రచారం, విలువ జోడింపునకు రైతులకు హెక్టార్‌కు మూడేళ్లలో రూ.8,800 డీబీటీ ద్వా­రా ఇచ్చామన్నారు. ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్‌ వర­కు, ధృవీకరణ, మార్కెటింగ్, పంటకోత తర్వా­త ని­ర్వహణకు పూర్తి మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు.  

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)