Breaking News

‘జాతీయ విద్యా విధానం అమలులో ఏపీ టాప్‌’

Published on Sun, 07/02/2023 - 05:28

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాతీయ విద్యా విధానం అమలులో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమి షన్‌ చైర్మన్‌ జగదీష్ కుమార్‌ చెప్పారు. ఈ వి ద్యా విధానాన్ని అమలు చేయాలనుకున్న తొలినుంచి ప్రభు­త్వం తోడ్పాటు, సహకారం అభినందనీయమన్నా­రు. రాష్ట్రంలో ఉన్నత విద్య చాలా పటిష్టంగా ఉం­దని ప్రశంసించారు. జేఎన్‌టీయూ(కే)లో 2 రోజులపాటు జరిగే ఉన్నత విద్య ప్రణాళిక 5వ సమావేశం శనివారం జేఎన్‌టీయూ ప్రాంగణంలో ప్రారంభమైంది. దీనికి హాజరైన జగదీష్ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర వర్సిటీలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు.

జాతీయ విద్యా విధానంతో 2030 నాటికి భారతదేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ విద్యావిధానం అమలు చేయడంలో రా ష్ట్రాలు, స్థానిక సంస్థలు, పాఠశాలల స్థాయి లో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 600 వర్సిటీలలో రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. 

ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు 
వివిధ రకాల పరిశోధనల కోసం రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వినియోగించేందుకు యూజీసీ కార్యచరణ ప్రణాళిక రూపొందించిందని జగదీష్ కుమార్‌ చెప్పారు. యువ తకు ఉద్యోగవకాశాలు రావాలంటే నైపుణ్యం ఉండాల్సిందేనన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి బాగుందన్నారు. ఈ యూనివర్సిటీల ఏర్పాటుకు వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ–వర్సిటీలలో దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది విద్యార్థులను చే ర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)