Breaking News

పోర్టు సిబ్బందిపై సోమిరెడ్డి దాడి

Published on Tue, 10/29/2024 - 05:29

సాక్షి ప్రతినిధి నెల్లూరు/ముత్తుకూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాడికి తెగబడిన వైనం కలకలం రేపింది. కృష్ణ­పట్నం పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ పునద్ధరణ పనులపై యాజమాన్యంతో చర్చించేందుకు  ఎమ్మె­ల్యే సోమిరెడ్డి సోమవారం తన అనుచరులతో వెళ్లారు. పోర్టు ప్రధానద్వారం వద్ద విధులు నిర్వహి­స్తున్న సెక్యూరిటీ డీజీఎం ఎమ్మెల్యే కారుతోపాటు కొన్ని వాహనాలను లోనికి అనుమతించారు. 

మిగి­లి­న వాహనాలను తనిఖీచేయాలని నిలిపి­వేశారు. దీంతో ఆగ్రహించిన సోమిరెడ్డి కారునుంచి దిగివచ్చి కోపంతో ఊగిపోతూ అసభ్య పదజాలంతో తిట్లదండకం అందుకున్నారు. సెక్యూరిటీ డీజీఎంపై దాడికి తెగబడి ఆయన్ని వెనక్కి నెట్టివేశారు. తనకు జరిగిన అవమానాన్ని పోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసకు­వెళ్లే క్రమంలో పోలీసులు, నాయకులు డీజీఎంను వారించారు. ఇదే అంశంపై పోర్టు అడ్మిన్‌ భవనం వద్ద కూడా సోమిరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.

సీఈఓతోనూ దురుసు ప్రవర్తన
ఎన్నికలముందు పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ సేవలను పునరుద్ధరిస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటివరకు పోర్టు యాజమాన్యంతో చ­ర్చ­లు జరపకపోవడం, కార్యాచరణ చేపట్టకపోవ­డంతో సీఐటీయూ నాయకులు ఆందోళనకు పిలుపు­నిచ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి అఖిలపక్షం పేరుతో పోర్టు అధికారులతో మాట్లాడేందుకు సోమవారం వెళ్లిన సోమిరెడ్డి పోర్టు కార్యాలయంలోకి వెళ్లి సీఈఓతోనూ వాగ్వాదానికి దిగారు. ఆయనతో దురుసుగా ప్రవర్తిస్తూ కేకలు వేశారు. 

ఖండించిన కాకాణి   
కృష్ణపట్నం పోర్టులో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేయిచేసుకోవడాన్ని మాజీమంత్రి కాకాణి గోవర్ధన­రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమిరెడ్డి అఖిలపక్షం పేరిట డ్రామాలు ఆడుతూ, కూటమి పార్టీల నేత­లను పోర్టుకు తీసుకెళ్లడం ఏమిటని నిలదీశారు. అత్యంత భద్రత ఉండే ప్రధానమైన పోర్టులో తనిఖీచేసి వాహనాలను అనుమతి­స్తామని సె­క్యూ­రి­టీ సిబ్బంది చెప్పినా వినకుండా దాడి చేశారన్నారు. పోర్టు కార్యాలయంలోనూ సోమిరెడ్డి కేకలు వేసి సీఈఓతో దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. ఎమ్మెల్యే వీధిరౌడీలా మారి నేరుగా దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు.

కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ సిబ్బందిపై సోమిరెడ్డి దాడి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)