Breaking News

ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు షెడ్యూల్‌

Published on Sun, 07/13/2025 - 06:15

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ ఖరారైంది. నీట్‌ యూజీ2025 కౌన్సెలింగ్‌ ఈనెల 21 నుంచి ప్రారంభమవుతుందని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) శనివారం ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆలిండియా కోటా మొదటి దశ కౌన్సెలింగ్‌ కొనసాగుతుంది. అందులో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ నాటికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 7, 8 తేదీల్లో ఎంసీసీ డేటా పరిశీలన చేయనుంది. అలాగే ఈనెల 30 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు స్టేట్‌ కోటా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

సీట్లు పొందిన అభ్యర్థులు వచ్చే నెల 12లోగా ఆయా కాలేజీల్లో చేరాలి. రెండో దశ ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌ ఆగస్టు 12 నుంచి 20 వరకు, స్టేట్‌ కోటా కౌన్సెలింగ్‌ ఆగస్టు 19 నుంచి 29 వరకు ఉంటుంది.సెప్టెంబర్్‌ 3 నుంచి 10వ తేదీ వరకు మూడో దశ ఆలిండియా కోటా, 9 నుంచి 18 వరకు స్టేట్‌ కోటా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. స్ట్రే వేకెన్సీ కింద సెప్టెంబర్‌ 22 నుంచి 26 వరకు ఆలిండియా కోటా సీట్లను, 25 నుంచి 29 వరకు స్టేట్‌ కోటా సీట్లను భర్తీ చేస్తారు. ఆలిండియా కోటాలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 15 శాతం సీట్లు, ఎయిమ్స్, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లను భర్తీ చేస్తారు.సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, పూర్తి వివరాలను ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)