Breaking News

మెరుగైన ఫలితాల కోసమే మార్పులు 

Published on Tue, 12/12/2023 - 04:37

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ఏ నియోజక వర్గానికి ఎవరిని పార్టీ సమన్వయకర్త(ఇన్‌ఛార్జ్‌)గా నియమించాలో శాస్త్రీ­యంగా అధ్యయనం చేసిన అనంతరం మార్పులు చేర్పులకు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సోమవారం 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వ­యకర్తలను నియమించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహా­రాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను ప్రకటించారు. మంగళవారం నుంచి 11 నియోజవర్గాల్లో పార్టీ వ్యవ­హారాలన్నీ కొత్తగా నియమితులైన సమ­న్వయకర్తలే పర్యవేక్షిస్తారని తెలిపారు. వచ్చే ఎన్ని­కల్లో మెరుగైన ఫలితాల కోసమే ఈ మార్పులని, భవిష్యత్తులోనూ ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చని వారు స్పష్టం చేశారు.

బొత్స మాట్లాడుతూ.. ఏ ఒక్కరినీ పార్టీ వదులుకోదని, అందరి సేవలను వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. గత నాలు­గున్నరేళ్లుగా సీఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా­ర్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ వారికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చా­రన్నారు. సామాజిక సాధి­కారతను చేతల్లో చూపించారన్నారు. అణగారిన వర్గాలకు మరింతగా మంచి చేయాలంటే పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. భవిష్య­త్తులోనూ అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితు­లను సమీక్షించుకుంటూ అవసరాన్ని బట్టి ఇన్‌ఛార్జ్‌ల మార్పు చేర్పులపై తగిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.

గంజి చిరంజీవిని పార్టీలో చేర్పించింది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డేనని మంత్రి బొత్స గుర్తు చేశారు. మంగళగిరి నియోజకవర్గ పార్టీ సమన్వ­కర్తగా చిరంజీవిని సీఎం జగన్‌ నియమించారన్నారు. పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి సముచిత స్థానం ఇస్తారని చెప్పారు. పార్టీ ఏ ఒక్కరినీ వదులు­కోబో­దని, ఎవరి సేవలు ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. ఈ మార్పు­ల వల్ల కొందరికి బాధ ఉండవచ్చని, అయితే అందరూ సీఎం జగన్‌ నిర్ణయాలను అర్థం చేసుకుని పార్టీకి సహకరిస్తారన్నారు.

సజ్జల మాట్లా­డుతూ.. ‘‘సీఎం జగన్‌ వైఎస్సార్‌సీపీని స్థాపించిన నాటి నుంచి పార్టీని ప్రజలకు జవాబుదారీగా ఉంచారు. సీఎం జగన్‌ దృష్టిలో శాసనసభ్యుడికి ఎంత విలువ ఉంటుందో కార్యకర్తకూ అంతే విలువ ఉంటుంది. పార్టీకి కార్యకర్తలే ప్రాణం. ప్రజలకు మరింతగా సేవ చేయా­లంటే మళ్లీ అధికారంలోకి రావాలి. ప్రజలతో మమే­కమై వారి మనసులు చూరగొని ఆశీస్సులు పొంది ఎవరు రాణిస్తారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణ­యాలు తీసుకుంటామని సీఎం జగన్‌ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలోనే 11 నియోజ­కవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు.

భారీ మెజా­ర్టీతో గెలవాలన్న ఆలోచనతోనే మార్పు­లు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చు.. ఉండకపోవచ్చు కూడా! పార్టీ ఒక వ్యక్తి కోసమో.. వ్యక్తుల కోసమో ఉండదు. ఎవరిౖకైనా ఇబ్బంది ఉంటే కూర్చో­బెట్టి మాట్లాడతాం. ఎందుకు మార్పు చేశామనేది అంతర్గతంగా వారికి వివరిస్తాం’’ అని అన్నారు. ప్రతి­పక్షా­లు గాలి మాటలతో గందరగోళానికి గురిచేసే ప్రయ­త్నం చేస్తున్నాయని, పొత్తులపై ఒక దారీ తె­న్నూ లేకుండా వ్యవహరి­స్తున్నాయని అన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)