ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఆపలేరు

Published on Wed, 11/05/2025 - 04:58

టెర్మినల్‌ బెనిఫిట్స్‌ కోసం పిటిషన్లు దాఖలు చేసిన వారు 70, 80, 90 ఏళ్ల సీనియర్‌ సిటిజన్లు. ఈ వయస్సులో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీరి నుంచి జీవితాంతం సేవలు తీసుకున్నారు. పదవీ విరమణ తర్వాత 16 ఏళ్లకు కూడా వారికి పదవీ విరమణ ప్రయోజనాలను ఇవ్వకపోవడం అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం.        – ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు  

సాక్షి, అమరావతి: పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాంతర ప్రయోజనాలైన (టెర్మినల్‌ బెనిఫిట్స్‌) గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్ మెంట్‌ తదితరాలను చెల్లించడంలో ప్రభుత్వం, దాని పర్యవేక్షణలోని సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏళ్ల తరబడి సేవలు చేయించుకుని వారికి టెర్మినల్‌ బెనిఫిట్స్‌ను చెల్లించకపోవడం చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.

టెర్మినల్‌ బెనిఫిట్స్‌ ప్రభుత్వాల దాతృత్వం కాదని, అవి ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో ఉద్యోగులకు రాజ్యాంగం కలి్పస్తున్న సామాజిక భద్రత హక్కును ప్రభుత్వం, దాని సంస్థలు కాలరాయలేవని పేర్కొంది. పదవీ విరమణ చేసిన 16 ఏళ్లకు కూడా ఉద్యోగులకు టెర్మినల్‌ బెనిఫిట్స్‌ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ ఉద్యోగులు  వడ్డీతో సహా బకాయిలను పొందేందుకు అర్హులని హైకోర్టు తేల్చి చెప్పింది.

నాటి నుంచి టెర్మినల్‌ బెనిఫిట్స్‌ పొందని పిటిషనర్లు..
చిట్టిబోయిన భారతరావు, పి. చంద్రమౌళీశ్వరరావు, బండ శివరామకృష్ణ ప్రసాద్, ఏ.సాయిబాబు పెయిడ్‌ సెక్రటరీలుగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పనిచేశారు. తరువాత వారి పోస్టులు డీ–కేడరైజ్డ్‌ చేసి  సెక్రటరీలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలోకి (పీఏసీఎస్‌) బదిలీ చేశారు. నాబార్డ్‌ మార్గదర్శకాల ప్రకారం వారిని 2009 మార్చి 2న తిరిగి పెయిడ్‌ సెక్రటరీ­లు­గా డీసీసీబీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పదవీ విరమణ వరకు వారు ఎలాంటి మచ్చ లేకుండా పని చేశారు.

రిటైర్‌ అయినప్పటికీ, వారికి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ వంటి టెర్మినల్‌ బెనిఫిట్స్‌ను చెల్లించలేదు. వీటి కోసం ప్రభుత్వం, డీసీసీబీలతో పోరాడి అలసిపో­యిన ఆ వృద్ధులు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై డీసీసీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు కొంత కాలం పీఏసీఎస్‌లలో పనిచేసినందున, అవి వారి వాటా బెనిఫిట్స్‌ను చెల్లించాలని,  ఆ మొత్తం రాగానే దానితో కలిపి టెర్మి­నల్‌ బెనిఫిట్స్‌ ఇస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు.

16 ఏళ్ల తరువాత కూడా ప్రయోజనాలు చెల్లించరా...? 
‘రిటైర్‌ అయిన 16 ఏళ్లకు కూడా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వకపోవడం అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం, డీసీసీబీ, పీఏసీఎస్‌లు పిటిషనర్ల నుంచి వారి జీవిత కాల సేవలు పొందాయి. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా బెనిఫిట్స్‌ను చెల్లించలేదు. అది పిటిషనర్ల చట్టబద్ధమైన, రాజ్యాంగ హక్కులను హరించినట్లే. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం సెక్షన్‌ 7 ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 30 రోజుల్లోపు చెల్లించాలి. లేదంటే 
ఆ రోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాలి. దీని ప్రకారం ఈ కేసులో పిటిషనర్లు చట్ట ప్రకారం వడ్డీ పొందేందుకు అర్హులు.

ఇది యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు. గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్ మెంట్, ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు 10 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలి. ఫ్యామిలీ మెంబర్‌ సరి్టఫికెట్లు పరిశీలించి, ఆ తరువాత 8 వారాల్లో చెల్లించాలి. కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లు ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రభుత్వం, డీసీసీబీ, పీఏసీఎస్‌ చెల్లించాలి. టెర్మినల్‌ బెనిఫిట్స్‌లో పీఏసీఎస్‌ నుంచి రావాల్సిన వాటాను వసూలు చేసుకునే హక్కు డీసీసీబీకి ఉంది. పీఏసీఎస్‌ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టెర్మినల్‌ బెనిఫిట్స్‌ చెల్లించలేకపోయామన్న డీసీసీబీ వాదన చట్టబద్ధం కాదు’ అని జస్టిస్‌ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)