Breaking News

కోర్టుల్లో కేసు ఫైళ్లు మాయం అవడమా?

Published on Tue, 09/13/2022 - 05:33

సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లోనే కేసుల ఫైళ్లు మాయం అవుతుండటంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కోర్టుల్లోనే ఫైళ్లు మాయం అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు, తప్పు చేసే ప్రభుత్వాధికారులను తామెలా ప్రశ్నించగలమని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. నర్సరావుపేట సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, గుంటూరు జిల్లా కోర్టులో ఓ కేసుకు సంబంధించిన ఫైల్‌ మాయం కావడంపై విచారణకు ఆదేశించింది.

ఈ ఘటనపై విచారణ జరపాలని గుంటూరు ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జిని ఆదేశించింది. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసేలా చూడాలంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు కోర్టుల్లోనూ లేని కేసు ఫైల్‌
నర్సరావుపేటలోని సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 1998 ఏప్రిల్‌ 6న ఓ కేసులో ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్‌ కాపీని ఇవ్వాలంటూ వినుకొండకు చెందిన షేక్‌ లతీఫ్‌ సాహెబ్‌ దరఖాస్తు చేశారు. అయితే ఆ కేసు ఫైల్‌ తమ వద్ద లేదంటూ ఆ దరఖాస్తును కోర్టు సిబ్బంది తిరస్కరించారు. గుంటూరు జిల్లా కోర్టులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో లతీఫ్‌ సాహెబ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.వెంకట రామారావు వాదనలు వినిపిస్తూ, నర్సరావుపేట కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ కేసులో తాము అడుగుతున్న సర్టిఫైడ్‌ కాపీ అవసరం చాలా ఉందన్నారు. ఎక్కడా ఆ ఫైల్‌ లేకపోవడంతో సర్టిఫైడ్‌ కాపీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఆ కాపీ లేకపోవడం వల్ల పిటిషనర్‌కు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం  దీనిపై విచారణ జరపాలని గుంటూరు ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జిని ఆదేశించింది.  

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)