Breaking News

ఇలాంటివన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే

Published on Thu, 03/07/2024 - 05:35

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు జారీ చేసే కుల, స్థానికత, జనన ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో, నవరత్నాల లోగో ముద్రించడం వల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని హైకోర్టు ప్రశ్నించింది. వాటిపై సీఎం ఫొటో, నవరత్నాల లోగో ఉంటే పిటిషనర్‌ హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని కూడా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఫొటో ఉంటే వచ్చిన నష్టం ఏమిటని నిలదీసింది.

ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అవుతాయని వ్యాఖ్యా­నించింది. ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌ రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్సీ, ఎస్టీల కుల, స్థానికత, జనన ధృవీకరణ పత్రాలపై సీఎం వైఎస్‌ జగన్‌  ఫొటో, నవరత్నాల లోగో ముద్రించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని ముద్రించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ అమరావతి బహుజన సొసైటీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు విపిస్తూ ధృవీకరణ పత్రాల మీద సీఎం ఫొటో, నవరత్నాల లోగో ముద్రిస్తున్నారని, వాటిని పరిశీలించాలని కోర్టును కోరారు.

వాటిని పరిశీలించిన ధర్మాసనం.. ధృవీకరణ పత్రాలపై సీఎం ఫొటో, నవరత్నాల లోగో ఉంటే నష్టం ఏముందని ప్రశ్నించింది. అసలు పిటిషనర్‌ ఎవరని ఆరా తీసింది. పిటిషనర్‌ ఎస్సీ, ఎస్టీ, సంఘం అధ్యక్షుడని రవిప్రసాద్‌ తెలిపారు. సీఎం ఫోటో, లోగో వల్ల ఎన్నికల సమయంలో ప్రజలు ప్రభావితం అవుతారని అన్నారు. ఎలా ప్రభావితం అవుతారన్న ధర్మాసనం.. ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అవుతాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాది జీఎల్‌ నరసింహారెడ్డి వినతి మేరకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చింది.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)