Breaking News

ఎన్‌జీటీ ఉత్తర్వులపై హైకోర్టుకు రావొచ్చు   

Published on Wed, 01/21/2026 - 04:58

సాక్షి, అమరావతి: జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) జారీ చేసే ఉత్తర్వులను సవాలు చేస్తూ అధికరణ 226 కింద తమ ముందు దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్‌జీటీ చట్టం సెక్షన్‌ 22 కింద ఉన్న ప్రత్యామ్నాయం ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని, అయితే ఈ సెక్షన్‌ కింద హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంపై ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పింది. సెక్షన్‌ 22 కింద ఉన్న ప్రత్యామ్నాయం హైకోర్టు తన న్యాయ పరిధి ఉపయోగించకుండా అడ్డుకోలేదంది.

చట్ట నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి పర్యావరణ అనుమతులు (ఈసీ) లేకుండా జరిపే మైనింగ్‌ కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యే ఏ వ్యక్తి అయినా ఎన్‌జీటీ చట్టంలోని సెక్షన్‌ 16లో పేర్కొన్న ‘బాధిత వ్యక్తి’ నిర్వచన పరిధిలోకి వస్తారని తెలిపింది. ఎలాంటి కాలుష్యానికి తావు లేకుండా గాలి, నీరు పొందడమన్నది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కని హైకోర్టు పేర్కొంది. ఈ హక్కుకు భంగం కలిగితే ఏ వ్యక్తి అయినా అందుకు సంబంధించిన చర్యలను సవాలు చేయవచ్చునని పేర్కొంది.

ముఖ్యంగా పర్యావరణ అంశాల్లో సంబంధిత గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరైనా కూడా ఎన్‌జీటీ ముందు అప్పీల్‌ దాఖలు చేయవచ్చునని తేల్చి చెప్పింది. పొట్టిశ్రీరాములు జిల్లా మోమిడి గ్రామంలో సిలికా మైనింగ్‌ విషయంలో శ్రీకుమారస్వామి మైనింగ్‌ సంస్థకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పును, చట్ట నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.

పర్యావరణ అనుమతులను తాత్కాలికంగా నిలిపేస్తూ ఎన్‌జీటీ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఎన్‌జీటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీకుమారిస్వామి మైనింగ్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు వెలువరించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)