Breaking News

విమానాలతో విజయవంతంగా ఏరియల్‌ సర్వే

Published on Mon, 06/05/2023 - 07:59

సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని మరింత వేగవంతం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను వినియోగిస్తోంది. ఈ విధానంలోనూ విజయవంతంగా ముందుకెళ్తోంది. రీసర్వేలో 1.30 లక్షల చదరపు కిలోమీటర్లు కొలవాల్సివుంది. అందులో 32,252 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా, మిగిలిన ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా కొలవాలని నిర్ణయించారు.

కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 32,252 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా కొలవడం మొదలుపెట్టి ఇప్పటికే 30 వేల చదరపు కిలోమీటర్లకుపైగా పూర్తి చేశారు. మరో 15 రోజుల్లో మిగిలిన 2 వేలకుపైగా చదరపు కిలోమీటర్లలోనూ సర్వే పూర్తి చేస్తామని సర్వే సెటిల్మెంట్‌ అధికారులు తెలిపారు. 

త్వరగా సర్వే పూర్తి చేయడం కోసమే..
రీ సర్వేను ఇంకా వేగంగా నిర్వహించాలంటే డ్రోన్లకంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరే విమా­నాలు, హెలీకాప్టర్లను వినియోగించాలని ప్రభుత్వంనిర్ణయించింది. వాటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ భాగాన్ని కొలవొచ్చు. కానీ భూముల సర్వే కోసం ఇప్పటివరకు దేశంలో ఎక్కడా విమానాలను ఉపయో­గించలేదు. జాతీయ రహదారులు, కొన్ని పెద్ద ప్రాజె­క్టుల నిర్మాణానికి విమానాలతో ఆ ప్రాంతాలను కొలిచిన అనుభవం మాత్రమే ఉంది. దీంతో అందులో అనుభవం ఉన్న సంస్థలతో చర్చించి తొలి­సారి విమానాల ద్వారా భూముల కొలతను నంద్యాలలో ప్రారంభించారు.

ఎక్కువ ప్రాంతాన్ని కొలి­చేందుకు ఎక్కువ పిక్సెల్స్‌ ఉండే అత్యాధునిక కెమే­రాలు ఉపయోగించారు. వాటి చిత్రాలను హైదరా­బాద్‌లోని సర్వే ఆఫ్‌ ఇండియా లేబొరేటరీలో తనిఖీ చేయించారు. డ్రోన్ల కంటేæ కచ్చితత్వంతో చిత్రాలు వచ్చాయని నిర్థారణ అయింది. అనంతరం 32 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రెండు ఏజెన్సీల ద్వారా 3 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో, ఒక ఏజెన్సీకి చెందిన హెలీకాప్టర్‌ను వినియోగించి సర్వే చేయించారు. డ్రోన్ల ద్వారా 120 మీటర్ల ఎత్తు నుంచి చిత్రాలు తీస్తు­న్నారు. విమానాల ద్వారా 1,500 మీటర్ల ఎత్తు నుంచి ఫొటోలు తీశారు. ఒక్క రోజులో 200 నుంచి 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని విమా­నాల ద్వారా కొలిచారు. ఎక్కువ పరిధిలోని భూమి ఒకే చిత్రంలో అత్యంత నాణ్యతతో రావడంతో రీసర్వే సుల­­భమైందని సర్వేశాఖ అధికారులు చెబుతున్నారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)