Breaking News

పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్‌’.. రోజుకు ఎన్నిసార్లు అంటే..?

Published on Thu, 03/27/2025 - 16:17

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యాశాఖ ‘వాటర్‌ బెల్‌’ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్నందున రోజుకు మూడుసార్లు వాటర్‌బెల్‌ (Water Bell) అమలు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయ్‌ రామరాజు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10, 11, 12 గంటలకు బెల్‌ మోగించాలని సూచించారు. అన్ని స్కూళ్లల్లోనూ ఈ వేళలు తప్పనిసరిగా పాటించాలని, తాగునీరు (Drinking Water) కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు.  

ఉన్నత విద్య కరిక్యులమ్‌ సంస్కరణలకు కమిటీ 
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్య కరిక్యులమ్‌లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కమిటీ నియమించింది. నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) –2020కి అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో సిలబస్‌ మార్పులపై కృష్ణా యూనివర్సిటీ మాజీ ఉప కులపతి  డాక్టర్‌ వెంకయ్య చైర్మన్‌గా 12 మంది యూనివర్సిటీ, డిగ్రీ కాలేజీల ప్రొఫెసర్లు సభ్యులుగా కమిటీ నియమించింది. ప్రత్యేక సభ్యులుగా బెంగళూరు ట్రిపుల్‌ ఐటీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సదగోపన్, అమెరికాలోని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ చాన్సలర్‌ డాక్టర్‌ అశ్విని కె ఓలేటిని నియమించింది.

అలాగే, ఇంజినీరింగ్‌ 3, 4 సంవత్సరాల కరిక్యులమ్‌ మార్పునకు తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ చైర్మన్‌గా 13 మంది ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్లతో మరో కమిటీని నియమించింది. ఈ కమిటీలు మూడు వారాల్లో తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి.

‘ఆస్ట్రేలియాలో విస్తృత విద్యావకాశాలు’
భారతీయ విద్యార్థులకు విదేశీ విద్య కోణంలో ఆస్ట్రేలియాలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, రీసెర్చ్‌ ఆధారిత కోర్సుల ఫలితంగా వారిలో నైపుణ్యాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని.. దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్‌ (ప్రభుత్వ అధినేత) పీటర్‌ మలినౌస్కస్‌ తెలిపారు. అదే విధంగా వీసా నిబంధనలు కూడా కఠినంగా లేవని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన స్టడీ అడిలైడ్‌ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ..

‘ఆస్ట్రేలియాలో ఆర్‌అండ్‌డీ, టెక్, సైన్స్, హాస్పిటా­లిటీ, ఇంజనీరింగ్‌ విభాగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. భారత విద్యార్థులు కొత్త అంశాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇదే వారిని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతోంది. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియాలు టాప్‌ యూనివర్సిటీలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రవేశాలు పొందిన వారికి మెరిట్‌ ఆధారిత స్కాలర్‌షిప్స్‌ కూడా లభిస్తాయి’ అని తెలిపారు.

చ‌ద‌వండి: 47 మండ‌లాల్లో తీవ్ర వ‌డ‌గాల్పులు

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)