Breaking News

ఎక్కువ మంది పిల్లల్ని కనండి

Published on Wed, 03/12/2025 - 05:35

సాక్షి, అమరావతి: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్ర­బాబు చెప్పారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తానని చెప్పారు. నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు ఇస్తానన్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అమరావతి ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో జరిగిన ‘జనాభా గతి–అభివృద్ధి’ వర్క్‌షాప్‌ ముగింపు సమావేశంలో చంద్రబాబు మాట్లా­డారు. ఆరు డెలివరీలైనా అన్నింటికీ ప్రసూతి సెలవులు ఇస్తామని చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గిపోతోందని, దీనివల్ల నియోజక­వర్గాలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పడంలేదని, దేశాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేసే యువత ఉండాలనే చెబుతు­న్నానని అన్నారు. ప్రస్తుతం పిల్లాడిని కనడంకన్నా స్టార్టప్‌ ఒకటి ఉంటే చాలనే ధోరణిలో యువత ఉన్నారన్నారు. భార్య, భర్త ఉద్యోగాలు చేస్తూ పిల్లల్లేకుండా ఎంజాయ్‌ చేస్తున్నారని, ఇది సామాజిక బాధ్యత కాదని అన్నారు.

త్వరలోనే ప్రధానమంత్రితో అమరావతిలో రూ. లక్ష కోట్లతో ప్రాజెక్టులను పున:ప్రారంభిస్తామని, వాటిని  మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అమరావతికి ప్రపంచంలో అత్యుత్తమ ఇన్‌స్టిట్యూషన్స్‌ను తెస్తున్నామని చెప్పారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చైర్మన్‌ టీ.ఆర్‌. పరవేందర్‌ మాట్లాడుతూ దేశంలో ఇంకా  కోట్ల మంది తిండిలేక ఆకలితో ఉంటున్నారని, అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. అంతకు ముందు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో పలు భవనాల శంకుస్థాపనల్లో చంద్రబాబు పాల్గొన్నారు. 
 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)