అవనిగడ్డలో పనిచేయాలంటే నాయుడిగానే పుట్టాలా?

Published on Thu, 11/27/2025 - 17:34

సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో ఓ హోంగార్డు సెల్ఫీ వీడియో వైరల్‌ కావడం కలకలం రేపుతోంది. ఇసుక, రేషన్‌ బియ్యం, పేకాట వ్యవహారం విచ్చలవిడిగా నడుస్తోందని.. నిజాయితీగా డ్యూటీ చేస్తుంటే ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ హోంగార్డు వాపోయాడు. ఈ క్రమంలో తన తోటి హోంగార్డులపైనా సంచలన ఆరోపణలు చేశాడు. 

హోంగార్డు నరేష్‌ విడుదల జిల్లా ఎస్పీకి పంపిన ఆ ఫిర్యాదు వీడియోలో..  నా తోటి హోంగార్డులు దుర్గారావు, జరుగు శ్రీనుతో పాటు టీవీ5కి చెందిన ఓ ప్రతినిధి నన్ను వేధిస్తున్నారు. అవనిగడ్డలో ఇసుక , రేషన్ బియ్యం , పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. నా డ్యూటీ నేను చేసినా నన్ను టార్గెట్ చేశారు. నా డ్యూటీ నేను చేయడం తప్పా. నేను దళితుడిగా పుట్టడమే తప్పా. అవనిగడ్డలో పనిచేయాలంటే నాయుడిగానే పుట్టాలా?.. 

పేకాట ఆడేవారిని పట్టుకున్నా ఎమ్మెల్యే మనుషులంటూ హోంగార్డు దుర్గారావు విడిచిపెట్టేస్తున్నారు. నన్ను మోపిదేవి నుంచి హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేయించారు. నన్ను వేధిస్తున్నారు. మీరే న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే చనిపోమన్నా చనిపోతాను. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వడం లేదు..  మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలిసి మీకు నా ఆవేదన పంపిస్తున్నా. దయచేసి అవనిగడ్డ డివిజన్ లో పోలీసు వ్యవస్థను చక్కదిద్దండి ఆ వీడియోలో నరేష్‌ కోరాడు. 

స్పందించిన ఎస్పీ.. 
హోంగార్డ్ సెల్ఫీ వీడియోపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారణకు ఆదేశించారు. పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించామని.. విచారణ నివేదిక అందిన వెంటనే తగిన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారాయన.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)