Breaking News

నేటి నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు

Published on Mon, 02/24/2025 - 05:12

సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్‌ సమా­వేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. 

ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 25వ తేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది. 

⇒ ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు హాజరవుతారనే సమాచారంతో ఆంక్షలు పెంచారు. భద్రత పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవేశాలు, రాకపోకలకు సంబంధించి నిబంధనలను పెంచారు. అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు వేర్వేరు రంగులతో పాస్‌లు ఇచ్చారు. అధికారులు, మీడియా, విజిటర్లు, పోలీసులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన పార్టీలకు ఎన్ని కావాలంటే అన్ని పాసులు జారీ చేసి వైఎస్సార్‌సీపీకి మాత్రం చాలా పరిమితంగా పాసులు ఇచ్చారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)