Breaking News

4 గంటల కోసం... 20 గంటలు అధిక ధర చెల్లింపు!

Published on Wed, 05/07/2025 - 05:21

సాక్షి, అమరావతి: సాయంత్రం అవసరమవుతుందని.. ఉదయం నుంచి అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేస్తామా? వేసవిలో డిమాండ్‌ ఉంటుందని వానాకాలంలోను, శీతాకాలంలోను తక్కువ రేటుకు విద్యుత్‌ దొరికే అవకాశం ఉన్నా, దాన్ని కాదని ఎక్కువ రేటు చెల్లిస్తామా..? ఎప్పుడు అవసరమైతే అప్పుడు బహి­రంగ మార్కెట్‌లో విద్యుత్‌ దొరుకుతుంటే.. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతోపాటు రిలయన్స్‌ వంటి బడా కంపెనీలు తక్కువ రేటుకే విద్యుత్‌ సరఫరా చేసేందుకు ముందుకొస్తుంటే విజ్ఞత ఉన్నవారెవరైనా వద్దంటారా..? యాక్సిస్‌ ఎనర్జీతో కూటమి ప్రభుత్వం ఒప్పందం గురించి తెలిసిన తర్వాత ఎవరికైనా వచ్చే సాధారణ సందేహాలివి. 

కానీ, దోచుకోవడమే పరమావధిగా భావించే సీఎం చంద్రబాబుకు మాత్రం ఇవేవీ పట్టవు. అందుకే దాదాపు రూ.11 వేల కోట్ల భారీ కుంభకోణానికి నిస్సిగ్గుగా తెరతీశారు. యాక్సిస్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పీపీఏ కుదుర్చుకున్నారు. 400 మెగావాట్ల పవన–సౌర హైబ్రీడ్‌ పైలట్‌ ప్రాజెక్టు నుంచి పునరుత్పాదక విద్యుత్‌ను 25 ఏళ్లపాటు యూనిట్‌కు ఏకంగా రూ.4.60 చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు.  

ఇదేం విడ్డూరం బాబూ 
వ్యవసాయానికి 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ అందించడానికి, రాష్ట్రంలో భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు, పవర్‌ గ్రిడ్‌ డిమాండ్‌ను సమతూకం చేసేందుకు ‘సెకీ’ నుంచి సౌర విద్యుత్‌ను తీసుకోవాలని గత ప్రభుత్వం సంకల్పించింది. అది కూడా సెకీ తనకు తానుగా ముందుకొచ్చి విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రతిపాదిస్తూ లేఖ రాయడం వల్ల జరిగింది. అందులోనూ 7వేల మెగావాట్లను కేవలం యూనిట్‌ రూ.2.49కే పాతికేళ్లపాటు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపుతో అందిస్తామని సెకీ చెప్పడంతో ఒప్పందం కుదుర్చుకుంది.

గతేడాది నుంచే ఈ విద్యుత్‌ను రాష్ట్ర డిస్కంలు తీసుకోవాల్సి ఉన్నా, కూటమి అధికారంలోకి రావడంతో ఆగిపోయింది. ఇంతవరకూ తక్కువ ధరకు వచ్చే సెకీ విద్యుత్‌ను ఏపీ వినియోగించుకోలేకపోతోంది. కానీ, ఇప్పటివరకు ప్లాంటు కూడా పెట్టని యాక్సిస్‌తో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని రెండేళ్లలో నిరి్మంచి, ఆ తర్వాత యూనిట్‌ రూ.4.60కి కొనేందుకు కూటమి ఒప్పందం కుదుర్చుకుంది. పైగా ఇన్నాళ్లూ సెకీ నుంచి విద్యుత్‌ తీసుకుంటే విద్యుత్‌ వృథా అవుతుందని, ప్రజలపై భారం పడుతుందని టీడీపీ, ఎల్లో మీడియా ద్వారా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి.

కానీ, ఇప్పుడు సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకున్నా కూడా రాష్ట్ర అవసరాలకు సరిపోదని ఏపీఈఆర్‌సీ చేత సీఎం చంద్రబాబు చెప్పించారు. పాతికేళ్లపాటు తక్కువ ధరకు సెకీ విద్యుత్‌ వస్తుంటే తీసుకోలేనివారు, రెండేళ్ల తర్వాత వస్తుందనుకుంటున్న యాక్సిస్‌ పవర్‌ను అధిక ధరకు కొంటామనడం విడ్డూరంగా ఉందని ఇంధన రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.   

పక్కా దోపిడీ! 
సహజంగా సౌర విద్యుత్‌ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు పవన విద్యుత్‌ వస్తుంది. ఏడాదిలో కొన్ని రోజులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, డిమాండ్‌ వల్ల గ్రిడ్‌ ప్రభావితమైనప్పుడు ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు రావడం పునరుత్పాదక విద్యుత్‌లో సహజం. ఇలాంటి సమయాల్లో గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీని బాలెన్స్‌ చేయడానికి బేస్‌ పవర్‌ను ఫీడ్‌ చేస్తారు. అంటే థర్మల్, హైడల్, గ్యాస్‌ వంటి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్‌ను తీసుకుంటారు. అలా కూడా విద్యుత్‌ సరిపోలేదంటే, బహిరంగ మార్కెట్‌ (పవర్‌ ఎక్సే్చంజీ)లో కొనుగోలు చేస్తుంటారు. ఇందుకోసం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేసి, కొనుగోలు చేసే సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర అందుబాటులో ఉంది.

కానీ, సౌర విద్యుత్‌ రాత్రి వేళ అందుబాటులో ఉండదనే విషయాన్ని బూచిగా చూపించి ప్రజల ఖజానాను దోచేసే పయత్నం చంద్రబాబు చేస్తున్నారు. బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థ వల్ల నాలుగు గంటలపాటు యాక్సిస్‌ విద్యుత్‌ బ్యాక్‌ అప్‌ వస్తుందని, అందుకే అంత రేటు పెట్టామని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్‌ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్‌కు రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావడమంటే.. ఇంతకంటే పచ్చి దోపిడీ ఉండదు. పీక్‌ అవర్స్‌ డిమాండ్‌ 3 నుంచి 4 గంటలు మాత్రమే ఉంటుంది. దాని కోసం మిగిలిన 20 గంటలకు ఒకే ధర చెల్లించడం, పక్కా అవినీతికి నిదర్శనమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)