Breaking News

ఏపీఐఐసీ ‘అసైన్డ్‌ భూములు’ 22ఏ నుంచి తొలగింపు

Published on Sat, 03/14/2026 - 05:14

సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ (ఆంధప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి కేటాయించిన దాదాపు 75,000 ఎకరాల అసైన్డ్‌ భూములనురిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22 ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తక్షణమే తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇటీవల సీఆర్‌డీఏలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేరకు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మంత్రి పార్ధసారధి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 

⇒ ఏపీఐఐసీకి కేటాయించిన దాదాపు 75,000 ఎకరాల అసైన్డ్‌ భూములు సెక్షన్‌ 22 ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తక్షణమే తొలగించేందుకు ఆమోదం. నిషేధిత జాబితాలో ఉన్నందున పరిశ్రమలు స్థాపిస్తున్న వారు ఈ ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందలేకపోతున్నారు. అందువల్ల ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి మ్యుటేషన్‌కు అవకాశం కలి్పంచాలని కేబినెట్‌ నిర్ణయం. వీటికి అదనంగా మరో 51,603 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ఇతర భూములను నేరుగా ఏపీఐఐసీ పేరిట రెవెన్యూ రికార్డుల్లో మార్చేందుకు అనుమతి. 

⇒ పోలవరం హెడ్‌ వర్క్స్‌ ప్యాకేజీ 63 ఏలో రూ.23.47 కోట్ల అదనపు ఖర్చు, మరో ప్యాకేజీలో రూ.24.51 కోట్లు అదనపు ఖర్చుకు ఆమోదం. పోలవరం ఎడమ కాలువ పనుల్లో పాత ఏజెన్సీలను రద్దు చేసి మిగిలిన పనులకు 2024–25 రేట్లతో రూ.76.87 కోట్లతో ఇచి్చన టెండర్‌కు ఆమోదం.  

⇒ ఏపీఎస్‌పీ బెటాలియన్లలో 300 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్లు స్థాయికి పెంచేందుకు ఆమోదం.  
⇒ ‘సఖి నివాస్‌ పథకం’ కింద ఒంటరి మహిళలు, వితంతువులు, వివాహమై దూరంగా ఉంటున్న వారి కోసం  30 హాస్టల్స్‌ ఏర్పాటుకు ఆమోదం. ఒక్కో హాస్టల్‌ నిర్వహణకు వార్డెన్, సెక్యూరిటీ లాంటి 8 మంది సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌పై తీసుకునేందుకు ఆమోదం.  
⇒ వాణిజ్య పన్నుల కేసుల పరిష్కారం కోసం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని మూడు అప్పీలేట్‌ కార్యాలయాల పరిధిని నోటిఫై చేయడానికి ఆమోదం. 

⇒ జల్‌జీవన్‌ మిషన్‌ కింద రూ.9,355 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులకు పరిపాలన ఆమోదం. రూ.1,814.71 కోట్లతో చేపట్టనున్న 3,000 పనులకు పరిపాలన ఆమోదం.  
⇒ వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లి, సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు, కోతకుంటపల్లి, తుగుట్లపల్లి గ్రామాల్లో 424.45 ఎకరాల ప్రభుత్వ భూమిని జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ స్థాపన కోసం కేటాయించేందుకు ఆమోదం.  

⇒ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జక్కంపూడి కాలనీ వద్ద 400 కేవీ హైటెన్షన్‌ లైన్‌ ఎత్తు మార్పులకు సంబంధించి కరెంట్‌ సరఫరా ఆగిపోకుండా ల్యాంకో కంపెనీకి నోటీసులు జారీ చేసేందుకు ఆమోదం.  
⇒   ఏప్రిల్‌ 1వతేదీ నుంచి 90 రోజుల పాటు జలధార పేరుతో కాలువల్లో అడ్డంకుల తొలగింపు. 
⇒ ఈ నెల 16వ తేదీన శ్రీపొట్టి శ్రీరాములు జయంతి వేడుకల సందర్భంగా అమరావతిలో అమరజీవి 58 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)